News August 22, 2025
కంచికచర్లలో రోడ్డు ప్రమాదం.. తల్లి, బిడ్డ మృతి

కంచికచర్ల మండలం కీసర గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పసికందు మృతిచెందిన <<17483745>>విషయం తెలిసిందే<<>>. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లి నాగబత్తిని చైతన్యను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News August 23, 2025
జగిత్యాల: 17 ఏళ్ల పురాతన కేసు పరిష్కారం

జగిత్యాల జిల్లా న్యాయస్థానంలో 17 సంవత్సరాల పురాతన సివిల్ కేసును రాజీకి సహకరించిన న్యాయవాదులను జిల్లా జడ్జి రత్న పద్మావతి అభినందించారు. ఈ సందర్భంగా వాది, ప్రతివాది న్యాయవాదులు మారిశెట్టి ప్రతాప్, మేట్ట మహేందర్, బార్ ప్రెసిడెంట్ శ్రీరాములు ప్రత్యేక చొరవ వల్లే సాధ్యమైనట్లు జడ్జి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎస్ నారాయణ, వెంకట మాలిక్ శర్మ న్యాయవాదులు పాల్గొన్నారు.
News August 23, 2025
జగిత్యాలలో ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు

ఈశా గ్రామోత్సవం పేరిట ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవాన్ని ఈనెల 23, 24న జగిత్యాల మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు తెలిపారు. పురుషుల వాలీబాల్, మహిళల త్రోబాల్ పోటీలలో తమ జట్లను ఉచితంగా నమోదు చేసుకుని పాల్గొనాలన్నారు. గెలిచిన మొదటి 4 జట్లకు నగదు బహుమతి ఉంటుందన్నారు. ఫైనల్ ఈవెంట్ సెప్టెంబర్ 21న ఈషా యోగ సెంటర్ కోయంబత్తూర్ లో జరుగుతుందన్నారు.
News August 23, 2025
సెప్టెంబర్‌లో నైపుణ్య పోర్టల్ ప్రారంభం: లోకేశ్

AP: సెప్టెంబర్‌లో నైపుణ్య పోర్టల్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. దేశానికే రోల్ మోడల్‌గా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దాలని అధికారులను ఆయన ఆదేశించారు. పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌తో ఈ పోర్టల్‌ను అనుసంధానించాలని సూచించారు. ఏటా 50వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా దీనిని తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు.