News June 1, 2024
కంటోన్మెంట్ ఉప ఎన్నిక.. 17 రౌండ్లలో లెక్కింపు

కంటోన్మెంట్ ఉపఎన్నిక కౌంటింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో ఈవీఎంలను కూడా మేడ్చల్ జిల్లా పరిధి లెక్కింపు కేంద్రానికి తరలించారు. ఉప ఎన్నిక కౌంటింగ్‌లో భాగంగా మొత్తం 17 రౌండ్లలో లెక్కింపు ఉంటుందని రొనాల్డ్ రాస్ శనివారం తెలిపారు. ఈ ఫలితాన్ని కంటోన్మెంట్ బోర్డు CEO పర్యవేక్షించనున్నారు.
Similar News
News February 23, 2026
HYD: 2BHK ఇళ్ల కోసం.. ఇంకెన్నాళ్లీ నిరీక్షణ..?

BRS నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నివసించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కేటాయింపులు జరగడం లేదని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొల్లూరు, అమీన్‌పూర్ ఇతర ప్రాంతాల్లో ఇళ్లు పంచేందుకు సిద్ధంగా ఉన్నా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ఆశావహులకు అవి అందుతాయో లేదో తెలియని అయోమయం నెలకొంది. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించడంతో పాత ఇళ్ల కేటాయింపుపై సందిగ్ధత ఏర్పడింది.
News February 23, 2026
HYD: 8712441912కు Hi అని పంపండి

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారుల కోసం వాట్సాప్ చాట్‌బాట్ ప్రారంభించింది. <<8712441912>>8712441912<<>> నంబర్‌కు విద్యుత్ సంస్థతో లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి వాట్సాప్‌లో Hi అని పంపితే ఫిర్యాదుల నమోదు, బిల్ వివరాలు, విద్యుత్ సరఫరా స్థితి వంటి సేవలు పొందవచ్చు. ఛైర్మన్& ఎండీ ముషారఫ్ ఫరూఖీ ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. ఎప్పుడైనా, ఎక్కడైనా విద్యుత్ సమాచారాన్ని సులభంగా పొందే అవకాశం కల్పించారు.