News February 9, 2026

కంట్రోల్ రూమ్‌ను సద్వినియోగం చేసుకోండి: నిర్మల్ కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని 3 మున్సిపాలిటీలలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఎన్నికల్లో ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. నిర్మల్ మున్సిపాలిటీ 7036661070, ఖానాపూర్ మున్సిపాలిటీ 9949282528, బైంసా మున్సిపాలిటీ 8466056568 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.

Similar News

News March 7, 2026

భారత్ భద్రతలో సేఫ్‌గా ఇరాన్ షిప్

image

IRIS <<19299071>>దేనా<<>> దాడికి గురైన నేపథ్యంలో భారత్ ఆ నౌకకు ఆశ్రయం కల్పించాల్సిందనే విమర్శలు వచ్చాయి. కానీ నిజానికి భారత్‌ ఇరాన్‌కు సహకరిస్తూనే ఉంది. ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న IRIS లవన్ అనే మరో నౌక ఇప్పుడు కొచ్చి పోర్టులో సేఫ్‌గా ఉంది. ఇరాన్‌పై US దాడి చేసిన రోజునే (Feb 28) 183 మంది సిబ్బంది గల ఈ నౌక సంకేతిక సమస్యల వల్ల భారత్ సాయం కోరింది. దేనా విషయంలో కేంద్రానికి ఇరాన్‌ ఎలాంటి రిక్వెస్ట్ చేయనట్లు తెలుస్తోంది.

News March 7, 2026

మూడుసార్లూ కివీస్‌దే పైచేయి.. ఈసారి చెక్ పడాల్సిందే!

image

T20WC: ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడేందుకు భారత్ ఇంకో గెలుపు దూరంలో ఉంది. అయితే ప్రత్యర్థి న్యూజిలాండ్‌తో T20WC చరిత్రలో భారత్‌కు పేలవ రికార్డ్స్ ఉండటం చర్చనీయాంశమైంది. భారత్ NZతో ఆడిన మూడు మ్యాచుల్లోనూ (2007, 2016, 2021) కివీస్‌దే విజయం. ఈసారి ఆ జట్టు ఓపెనింగ్, ఫీల్డింగ్, స్పిన్ బలంగా ఉందని.. సెమీస్ తరహాలోనే భారత్ రాణించి కప్పు కొట్టాలని, ఆ స్ట్రీక్ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News March 7, 2026

బాబీ డైరెక్షన్‌లో హృతిక్ రోషన్‌?

image

తాను త్వరలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి పనిచేయనున్నానని రైటర్ కోన వెంకట్ ప్రకటించారు. ఆ సినిమాను బాబీ డైరెక్ట్ చేయనున్నట్లు చెప్పారు. అయితే, బాలీవుడ్ వర్గాలు మాత్రం ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదంటున్నాయి. హృతిక్ ఓకే చెప్పలేదని.. కథ మాత్రమే విన్నారంటున్నాయి. ప్రస్తుతం ఆయన బిగ్ బడ్జెట్ మూవీ కోసం రెడీ అవుతున్నారని టాక్. అయితే ఆ మూవీయే కోన-బాబీ సినిమా అని మరికొంత మంది అంటున్నారు.