News April 2, 2025
కంట్లో కారం చల్లి బంగారం గొలుసు ఎత్తుకెళ్లారు

కంట్లో కారం చల్లి బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రామచంద్రపురానికి చెందిన ఓ మహిళ (45) అల్లుడు సూర్య తేజ (19) స్కూటీ పై లింగంపల్లి తీసుకెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వెంబడించారు. వెనుక నుంచి వచ్చి స్కూటీని ఢీ కొట్టారు. కంట్లో కారంపొడి చల్లి బంగారం గొలుసు ఎత్తుకెళ్లారు. రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 23, 2025
ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించండి: కలెక్టర్

కర్నూలు నగర ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించాలని సంబంధింత అధికారులను కలెక్టర్ సిరి ఆదేశించారు. గురువారం సాయంత్రం కర్నూలు నగర శివారులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు. ట్యాంక్ స్థితి, నీటి నిల్వను సమీక్షించారు. సమ్మర్ సిద్ధతలను దృఢంగా క్రమబద్ధం చేయాలని ఆదేశించారు. తక్షణ మరమ్మతులు, రక్షణ చర్యలపై అధికారులు దృష్టి పెట్టేలా సూచించారు. తాగునీటి సరఫరా సురక్షితం చేయడం ప్రధాన లక్ష్యమన్నారు.
News October 23, 2025
ఖనిజ రంగంలో సింగరేణి మరో ముందడుగుదడుగు

ఖనిజాల రంగంలో సింగరేణి మరో ముందడుగు వేసింది. సింగరేణి ప్రాంతంలో ఆ ఖనిజాల గుర్తింపు, ప్లాంట్ నిర్మాణంపై గురువారం కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ ఎన్ఎఫ్‌టీడీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ సీఅండ్‌ఎండీ బలరామ్ మాట్లాడుతూ… సింగరేణి ప్రాంతంలో లభ్యమవుతున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికిని తెలుసుకొని ఉత్పత్తి చేసేందుకు కొత్తగూడెంలో ప్రయోగాత్మక ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
News October 23, 2025
వరి ధాన్యం కొనుగోలు సాఫీగా నిర్వహించాలి: కలెక్టర్

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు వరి ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పించారు.