News October 18, 2025
కండ్లపల్లి చెరువు కట్ట పరిశీలన.. డ్యామ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

జగిత్యాల శివారులోని కండ్లపల్లి చెరువు కట్ట ఇటీవల కుంగిపోయి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం కట్టను పరిశీలించారు. చెరువు కట్ట మరమ్మతులకు సంబంధించి తక్షణం చేపట్టవలసిన పనులను సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులకు వారు సూచించారు. ఈ తనిఖీలో విశ్రాంత ఎన్‌సీ రామరాజు, సేఫ్టీ అధికారిణి విజయలక్ష్మి, నీటిపారుదల శాఖ ఈఈ ఖాన్, జియాలజిస్ట్ పద్మరాజు పాల్గొన్నారు.
Similar News
News October 18, 2025
తెలంగాణ బంద్.. వరంగల్ పోలీసుల బందోబస్తు

బీసీ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇవ్వడంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు చేపట్టారు. రోడ్లపై ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు, హన్మకొండ, వరంగల్, జనగామ, నర్సంపేట మొదలైన ప్రాంతాల్లోని బస్ డిపోల వద్ద మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
News October 18, 2025
నేటితో ముగియనున్న జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

హనుమకొండలోని జేఎన్ఎస్‌లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి అథ్లెక్స్ పోటీల్లో మూడో రోజు ప్రారంభమయ్యాయి. 5000 మీటర్ల పరుగు పందెంలో అథ్లెట్లు పాల్గొన్నారు. చివరి రోజు 23 అంశాల్లో పోటీలు జరగనుండగా,16 అంశాల్లో విజేతలెవరో వెల్లడిస్తారు. సెమీఫైనల్స్‌లో నెగ్గి ఫైనల్స్‌కు చేరుకున్న అథ్లెట్లంతా పతకాల వేట సాగించనున్నారు. ఫైనల్స్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
News October 18, 2025
రాయలసీమ, దక్షిణ కోస్తాకు భారీ వర్షసూచన

AP: ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో బంగాళాఖాతం మీదుగా గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడనుందని, దీంతో రేపట్నుంచి వర్షాలు పెరిగే ఆస్కారముందని చెప్పింది.