News September 12, 2025
కంది: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి రూ.1119 కోట్ల రక్షణ శాఖ ఆర్డర్

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి రూ.1119 కోట్ల రక్షణ శాఖ ఆర్డర్ రావడం చాలా ఆనందంగా ఉందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. విలువైన ఆర్డర్ రావడం కోసం సహాయం చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, AVNL బృందానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మైలు సాధించడంలో మెదక్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తను చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటానన్నారు.
Similar News
News September 12, 2025
KPHB: ఆత్మహత్యాయత్నం కేసులో గృహిణి రిమాండ్

KPHB 6వ ఫేజ్‌లో దంపతులు సూసైడ్ అటెంప్ట్ కేసు గత నెల 30న సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిలో భర్త రామకృష్ణారెడ్డి చనిపోగా భార్య రమ్యకృష్ణ చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అప్పుల బాధ తాళలేక ఇద్దరు ఆత్మహత్యకు యత్నించడం, భర్తను కత్తితో గాయపరచగా రక్తస్రాపమై మృతి చెందాడు. భార్య చనిపోవడానికి ప్రయత్నించగా భయం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
News September 12, 2025
JGTL: యువకుడి ఆత్మహత్య..?

వెల్గటూర్ మం. ముత్తునూరుకు చెందిన సంఘా శరత్(24) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిరోజులుగా ముభావంగా ఉంటున్న అతడు చివరిసారిగా స్నేహితులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లుగా సందేశం పంపాడు. కాగా, వారు ఇంటికి చేరుకునేలోపే శరత్ ప్రాణాలు వదిలాడు. అయితే మృతుడు ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ అతడి ఆత్మహత్యకు సరైన కారణం పోలీసుల విచారణలో తేలనుంది.
News September 12, 2025
విజయవాడ: 163కి చేరిన డయేరియా కేసులు

విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇప్పటి వరకు మొత్తం 163 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఈ వివరాలను జిల్లా కలెక్టర్ జి. లక్ష్మిశ శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ప్రస్తుతం 92 మంది చికిత్స పొందుతుండగా, 71 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. డయేరియా బాధితులకు ప్రభుత్వం సరైన సమయంలో సరైన చికిత్స అందిస్తుందని ఆయన వివరించారు.