News April 16, 2025

కంది: డీఎస్సీ-2008 ఉపాధ్యాయులకు ట్రెజరీ ద్వారా జీతాలు

image

జిల్లాలో డీఎస్సీ-2008 ద్వారా ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో 63 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ, మండల పరిషత్ యాజమాన్యంలో ఫిబ్రవరి నెలలో నియామకం అయ్యారని వీరందరికీ ట్రెజరీ ద్వారానే జీతాలు అందనున్నాయని పేర్కొన్నారు.

Similar News

News November 3, 2025

ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్‌

image

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు.

News November 3, 2025

గద్వాల: ‘మత్స్య సంపద పెంపునకు చర్యలు చేపట్టాలి’

image

రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రత్యేక కార్యదర్శి సవ్యసాచి ఘోష్, డైరెక్టర్ నిఖిల పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మత్స్య సంపద పెంచేందుకు ఆయా జిల్లాలోని జలాశయాలను సిద్ధం చేసి చేప పిల్లలను వదలాలని సూచించారు. ఈ సీజన్‌లో 7 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించామన్నారు.

News November 3, 2025

పీజీఆర్ఎస్ ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వండి: ఎస్పీ మీనా

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. అమలాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని చెప్పారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఇతర సమస్యలపై 40 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.