News July 8, 2025

కంది: మైనారిటీ గురుకులాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లా కంది మండలలోని మైనారిటీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా హాస్టల్ వసతులను, ఆహార నాణ్యతను, బోధన విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.

Similar News

News July 8, 2025

రేపల్లెలో రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

image

రేపల్లెలో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతుడు నగరం మండలం దూళిపాళ్ల గ్రామం కొండవీటి మణిగ స్థానికులు గుర్తించారు. యువకుడు 17645 నంబరు రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే సూపరింటెండెంట్, జీఆర్‌పీ ఆర్‌బీఎఫ్ సిబ్బంది తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 8, 2025

HYD: డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షురూ!

image

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈరోజు రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వ విద్యాలయంలోని ఆడిటోరియంలో కౌన్సెలింగ్ ప్రారంభం అయింది. మొదటి సీటు కేటాయింపు పత్రాన్ని శ్రీ వర్ధన్‌కి విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ డా.విద్యాసాగర్ అందచేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ పాలిటెక్నీక్స్ డాక్టర్ ఝాన్సీ రాణి ఉన్నారు.

News July 8, 2025

కళాశాలల వద్ద ఆకస్మిక తనిఖీలు – గుట్కా స్వాధీనం

image

ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని కాలేజీలు, స్కూల్స్‌ చుట్టూ “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్” కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. మత్తుపదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీపీ ఆదేశాల మేరకు పలు పాన్ షాపులు, బడ్డీ కొట్లు వద్ద ఆకస్మిక తనిఖీలు చేశారు. అనుమతులు లేని గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేశారు. దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.