News April 22, 2025

కంది: రిసోర్స్ పర్సన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయిలో మండల, జిల్లా స్థాయిలో రిసోర్స్ పర్సన్స్ గా పనిచేయడానికి ఆసక్తిగల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, LFL HMs, ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. నిర్ణీత నమూనాలో ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈ నెల 24వ తేదీ లోపు జిల్లా విద్యాశాఖ అధికారికి తమ దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు.

Similar News

News February 20, 2026

DRDOలో JRF పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

బెంగళూరు <>DRDO<<>> పరిధిలోని సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్స్ సిస్టమ్‌లో 10JRF పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరి తేదీ. BE/BTech, GATE స్కోరు గలవారు ఈ మెయిల్ jrf.rectt.cabs[at]gov.in ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.37000+HRA చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in

News February 20, 2026

కేవలం ఒకే చెంపదెబ్బ క్రూరత్వం కాదు: గుజరాత్ HC

image

తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లి, రాత్రంతా అక్కడే ఉన్నందుకు భార్యను భర్త ఒక్కసారి చెంప దెబ్బ కొట్టడం IPC సెక్షన్ 498A కింద క్రూరత్వం కాదని గుజరాత్ HC వ్యాఖ్యానించింది. ఓ కేసులో 23 ఏళ్ల తర్వాత భర్తను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు ఈ తీర్పునిచ్చింది. భార్య ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని నిరూపించడానికి బలమైన సాక్ష్యాలు ఉండాలని, కేవలం ఒక్క సంఘటనను క్రూరత్వంగా భావించలేమని కోర్టు స్పష్టం చేసింది.

News February 20, 2026

ఆత్మ గౌరవం కోసం కొన్ని మార్గదర్శకాలు

image

☛ నిన్ను నిర్లక్ష్యం చేసే చోట ఎదురుచూడటం ఆపేయ్.
☛ నీ భావాలకు విలువ లేని చోట వాటిని వ్యక్తపరచకు.
☛ నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి దేనికోసం పాకులాడకు.
☛ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఎవరినీ ప్రేమించకు.
☛ నిన్ను తక్కువ చేసి చూసే చోట చొరవ తీసుకోకు.
☛ జాలితో ఇచ్చే పలకరింపుల కోసం, ప్రేమ కోసం ఆశపడకు.
☛ నువ్వు భారమని అనుకునే చోట నీ మనసులోని భావాలను పంచుకోకు.