News March 18, 2024
కంది: సిగరెట్ కోసం గొడవ.. యువకుడి మృతి

సిగరెట్ కోసం ఇద్దరు స్నేహితులు గొడవపడి ఒకరు మృతి చెందిన సంఘటన సోమవారం కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ కథనం ప్రకారం బిహార్‌కు చెందిన అంకిత్, రోషన్ గ్రామ సమీపంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. సిగరెట్ కోసం రోషన్ అంకిత్ మధ్య గొడవ జరిగింది. దీంతో రోషన్(21)ను భవనం పైనుంచి కిందకు తోశారని వెల్లడించారు. తీవ్ర గాయాలైన రోషన్ ఆసుపత్రికి తరలించేలోపే మరణించారన్నారు.
Similar News
News December 14, 2025
MDK: 2 ఓట్లతో స్వప్న విజయం

నిజాంపేట మండలం నందిగామలో బీజేపీ మద్దతుదారు షేరి స్వప్న 2 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. గ్రామంలో వారి మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుపోతామని వారు పేర్కొన్నారు. నమ్మకంతో గెలిపించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
News December 14, 2025
MDK: 4 ఓట్లతో కనకరాజు విజయం

నిజాంపేట మండల పరిధిలోని రజాక్ పల్లిలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి సునీతపై బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వోజ్జ కనకరాజు 4 ఓట్లతో విజయం సాధించాడు. మండలంలో బీఆర్ఎస్ మొదటి విజయంతో ఖాతా ఓపెన్ చేయడం విశేషం. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడంతో గ్రామంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని అభ్యర్థి తెలిపారు.
News December 14, 2025
మెదక్ జిల్లాలో రెండో విడతలో 88.80% పోలింగ్

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. చేగుంట, మనోరాబాద్, మెదక్, నార్సింగి, నిజాంపేట్, రామాయంపేట, శంకరంపేట (ఆర్), తూప్రాన్ మండలాల్లో పోలింగ్ నిర్వహించగా 88.80 శాతం నమోదైంది. మొత్తం 1,72,656 ఓటర్లలో 1,53,313 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి.


