News June 5, 2024
కందుకూరును ప్రకాశంలో కలుపుతా: ఇంటూరి

కందుకూరు టీడీపీ నుంచి గెలిచిన అభ్యర్థి సంచలన ప్రకటన చేశారు. ‘వైసీపీ ప్రభుత్వం కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపి అన్యాయం చేసింది. దానిని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపడానికి ప్రయత్నం చేస్తా. అలాగే నారా లోకేశ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా’ అని కందుకూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. కందుకూరు మళ్లీ ప్రకాశం జిల్లాలో కలవడంపై మీ అభిప్రాయం ఏంటి?
Similar News
News September 12, 2025
ప్రకాశం: బార్ల లైసెన్సులకు గడువు పొడిగింపు

ప్రకాశం జిల్లాలోని 4 ఓపెన్ కేటగిరి బార్ల లైసెన్సులకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 ఓపెన్ బార్ల లైసెన్స్‌ల కొరకు దరఖాస్తు గడువు గతంలో 14వ తేదీ వరకు నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ గడువు తేదీని 17 వరకు పొడిగించామన్నారు.
News September 12, 2025
ఉలవపాడు: బాలికపై సచివాలయం ఉద్యోగి అత్యాచారం

ఉలవపాడులో ఇటీవల ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన గురువారం వెలుగు చూసింది. SI అంకమ్మ వివరాల ప్రకారం.. ఇటీవల అనాధగా కనిపించిన బాలిక(13)ను పోలీసులు సంరక్షించి అనాధ ఆశ్రమంలో చేర్చారు. సింగరాయకొండలో సచివాలయ ఉద్యోగిగా చేస్తున్న రామకృష్ణ ఇంట్లో బాలిక పనిమనిషిగా చేసింది. ఈక్రమంలో బాలికను బెదిరించి రామకృష్ణ అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 12, 2025
ప్రకాశం: ప్లెక్సీ యజమానులకు, ప్రజలకు ఎస్పీ కీలక సూచన!

ఫ్లెక్సీల రూపంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు, అనుచిత పదజాలంపై కఠిన చర్యలు తీసుకుంటామని SP దామోదర్ అన్నారు. గురువారం SP కార్యాలయంలో మాట్లాడుతూ.. డిజైన్ చేసే వారికి, ప్రజలకు, ప్రింటింగ్ ప్రెస్ వారికి సూచనలు చేశారు. ఫ్లెక్సీ పోస్టర్స్, ప్లకార్డుల రూపంలో వివాదాస్పద వ్యాఖ్యల వల్ల వర్గాల మధ్య విద్వేషాలను రేకెత్తిస్తున్నాయని, ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని పేర్కొన్నారు.