News March 19, 2025
కందుకూరు యువకుడికి గేట్‌లో మొదటి ర్యాంక్

గేట్ ఫలితాలు నేడు వెలువడిన విషయం తెలిసిందే. అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరుకి చెందిన సాదినేని నిఖిల్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించాడు. అతని తండ్రి శ్రీనివాసులు కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. నిఖిల్ చెన్నై IITలో ఆన్‌లైన్ ద్వారా డేటా సైన్స్‌లో డిగ్రీ చేశాడు. అంతేకాకుండా ఇతను ఢిల్లీ ఎయిమ్స్‌లో MBBS పూర్తి చేశాడు.
Similar News
News December 22, 2025
క్రిస్మస్‌కు ఒంగోలు మీదుగా స్పెషల్ ట్రైన్..!

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలుమీదుగా వేళాంగిణికి ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సోమవారం విడుదల చేసింది. సికింద్రాబాదు నుంచి వేళాంగిణికి స్పెషల్ ట్రైన్ (07407) చీరాల, ఒంగోలు మీదుగా 23వ తేదీన ప్రయాణిస్తుందన్నారు. అలాగే వేళాంగిణి నుంచి సికింద్రాబాదుకు (07408) స్పెషల్ ట్రైన్ 25వ తేదీన ఒంగోలు మీదుగా ప్రయాణిస్తుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
News December 22, 2025
ప్రకాశం: ఓపెన్‌లో టెన్త్, ఇంటర్ రాస్తున్నారా..!

ప్రకాశం జిల్లాలో ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ తేదీలను డీఈఓ రేణుక ప్రకటించారు. వచ్చే మార్చి 2 నుంచి 13 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 16 నుంచి 28 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్ష ఫీజులు తగిన అపరాధ రుసుము చెల్లించి ఈనెల 26 వరకు ఆన్లైన్‌లో చెల్లించవచ్చన్నారు. ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్స్, విద్యార్థులచo పరీక్ష ఫీజు చెల్లించేలా చేయాలన్నారు.
News December 22, 2025
ప్రకాశం కలెక్టర్ మీకోసంకు 268 అర్జీలు.!

ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రకాశం కలెక్టర్ మీకోసంకు 268 అర్జీలు అందినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ అర్జీలను సత్వరం పరిష్కరించేలా జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అర్జీలు రాకుండా, అర్జీల పరిష్కారంపై ఎప్పటికప్పుడు ప్రజలకు పూర్తి సమాచారాన్ని అధికారులు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.


