News November 4, 2025

కంపెనీకే 17ఏళ్ల జీవితాన్ని అంకితమిస్తే.. ఉద్యోగి ట్వీట్ వైరల్

image

అవిశ్రాంతంగా 17ఏళ్లు పనిచేసినా లేఆఫ్ ఇవ్వడంతో ఓ ఉద్యోగి చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘లేఆఫ్ బాధలో ఉన్న నేను పిల్లలను తొలిసారి స్కూల్‌కి తీసుకెళ్లా. అప్పుడు వారి నవ్వు చూసి నేను కోల్పోయిన సమయాన్ని గుర్తుచేసుకుంటే కన్నీళ్లు వచ్చాయి. కంపెనీలు త్యాగాలకు కాదు పనితీరుకే విలువనిస్తాయి’ అని రాసుకొచ్చారు. జీతమే ముఖ్యం కాదని, కుటుంబంతో గడిపే సమయం, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.

Similar News

News November 4, 2025

FLASH: నిర్మల్: యాక్సిడెంట్‌లో డ్రైవర్ మృతి

image

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలం రాంపూర్ గ్రామ 61 <<18197838>>జాతీయ రహదారిపై మంగళవారం <<>>మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మామడ మండలం కోరటికల్ గ్రామానికి చెందిన డ్రైవర్ రాజేశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

News November 4, 2025

చంద్రబాబు, లోకేశ్‌పై జగన్ సెటైర్లు

image

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా CM చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై YCP అధినేత జగన్ సెటైర్లు వేశారు. ‘ఇంత విపత్కర పరిస్థితిలో సీఎం ఒక రోజు వస్తాడు. అలా చాపర్‌లో తిరుగుతాడు. మరుసటి రోజు లండన్‌కు పోతాడు. ఆయన కొడుకు ఆస్ట్రేలియా నుంచి వస్తాడు. మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడటానికి పోతాడు’ అని ఎద్దేవా చేశారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

News November 4, 2025

రేపు పలు జిల్లాలకు వర్షసూచన

image

AP: కోస్తా తీరానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీంతో రేపు కోనసీమ, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, NLR, కర్నూలు, KDP, TPT జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వానలకు ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. ఇవాళ 5PM వరకు బాపట్లలో 61.5MM, నంద్యాల(D) నందికొట్కూరులో 51.7MM అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పింది.