News January 11, 2026

కంపెనీ సైన్యాన్ని ఊచకోత కోసిన ధీరుడు వడ్డే ఓబన్న

image

నొస్పం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరులో సైన్యాధ్యక్షుడిగా వడ్డే ఓబన్న వీరోచిత పాత్ర పోషించారు. వడ్డెరలు, బోయలు, చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్ధవంతంగా నడిపించి, దట్టమైన నల్లమల అడవుల్లో సైతం కంపెనీ సైన్యాన్ని ఊచకోత కోసిన వీరుడు వడ్డే ఓబన్న. ఈయన నంద్యాల(D) సంజామలలో 1807 జనవరి 11న వడ్డే సుబ్బమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. ఇవాళ ఆయన 219వ జయంతి.

Similar News

News February 21, 2026

చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>చెన్నై<<>> మెట్రో రైల్ లిమిటెడ్‌లో 19 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech, ME/MTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.62,000 నుంచి రూ.2,70,000 వరకు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBDలకు రూ.50. వెబ్‌సైట్: https://chennaimetrorail.org

News February 21, 2026

బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ చేసుకోవాలి: ఇందిర

image

BHPL: పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు కావాలంటే విద్యార్ధుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఇందిర సూచించారు. పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద పేర్లు నమోదు చేసుకున్న బీసీ, ఈబీసీ విద్యార్ధుల ఖాతాల్లో ఉపకారవేతనాల మొత్తం జమ కావాలంటే బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నంబర్‌తో సీడింగ్ చేయాలని సూచించారు.

News February 21, 2026

అభిషేక్ ఫామ్‌పై కెప్టెన్ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

image

T20WCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ అభిషేక్ డకౌట్ కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కెప్టెన్ సూర్య స్పందించారు. అభి గురించి ఆందోళన పడుతున్నవారి గురించి తాను ఆందోళన పడుతున్నట్లు చమత్కరించారు. అతడిని ఎదుర్కోబోతున్న ప్రత్యర్థి జట్లపై మరింత ఆందోళనగా ఉందన్నారు. అభి బ్యాట్‌తో ఏం చేస్తాడో గతేడాది చూశామని, ప్రస్తుతం మద్దతుగా నిలవాల్సిన టైమ్ అని చెప్పారు. దీంతో రేపటి మ్యాచ్‌లో అభిషేక్ ఆడటం కన్ఫర్మ్ అయినట్లే.