News January 11, 2026

కంపెనీ సైన్యాన్ని ఊచకోత కోసిన ధీరుడు వడ్డే ఓబన్న

image

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరులో సైన్యాధ్యక్షుడిగా వడ్డే ఓబన్న వీరోచిత పాత్ర పోషించారు. వడ్డెరలు, బోయలు, చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్ధవంతంగా నడిపించి, దట్టమైన నల్లమల అడవుల్లో సైతం కంపెనీ సైన్యాన్ని ఊచకోత కోసిన వీరుడు వడ్డే ఓబన్న. ఈయన నంద్యాల(D) సంజామలలో 1807 జనవరి 11న వడ్డే సుబ్బమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. ఇవాళ ఆయన 219వ జయంతి.

Similar News

News February 8, 2026

ADB: తలకెక్కిన అభిమానం.. నెత్తిపై కారును ఎత్తుకున్నాడు

image

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీల కార్యకర్తలు తమ అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభిమాని ఆ పార్టీపై తనకున్న అభిమానాన్ని తలకెత్తుకున్నాడు. మాజీ మంత్రి జోగు రామన్న చేపట్టిన ప్రచారంలో ఓ అభిమాని ప్లాస్టిక్ కారును తలపై ఎత్తుకొని ప్రచారంలో పాల్గొని అందరిని ఆకర్షించాడు.

News February 8, 2026

KMR: పుర పోరులో ఇద్దరు విద్యార్థులు

image

కామారెడ్డి జిల్లాలో ఆయా మున్సిపాలిటీల ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.. గృహిణులు 97 మంది, వ్యాపారం చేసుకునేవారు 88, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నవారు 13, ఇతరాలు 69, ఏమీ వ్యక్తపరచనివారు 178 మంది ఉన్నారు. కాగా ఇద్దరు విద్యార్థులు బరిలో ఉంటూ పలువురు యువతకు ఆదర్శంగా నిలిచారు. పెళ్లయిన వారు 296 మంది, పెళ్లి కానివారు 14, ఏమీ వ్యక్తపరచనివారు 137 మంది పుర ఎన్నికల సమరంలో బరిలో దిగారు.

News February 8, 2026

కడపలో నేడు పోటీలు.. గెలిస్తే రూ.70 వేలు.!

image

కడప నగరంలోని బిల్డప్ దగ్గర కొలువైన పోలేరమ్మ తల్లి తిరుణాల సందర్భంగా ఆదివారం బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి బహుమతి రూ.70 వేలు, రెండో బహుమతి రూ.50 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇలా ఐదు బహుమతులు వరకు ఉంటాయన్నారు. ఎద్దుల యజమానులు నిర్దేశించిన సమయంలో అక్కడికి చేరుకోవాలని కమిటీ సభ్యులు తెలిపారు.