News August 21, 2024

కంప్యూటరైజేషన్ ప్రక్రియను 100% పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కంప్యూటరైజేషన్ ప్రక్రియను 100% సెప్టెంబర్ మూడో తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సీఈఓలతో ఫాక్స్ కంప్యూటరైజేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. రైతుల సభ్యత్వానికి సంబంధించి 21 శాతం మాత్రమే ఆన్లైన్ చేశారనిని, 100% పూర్తి చేయాలని ఆదేశించారు.

Similar News

News February 19, 2026

మంత్రి లోకేశ్‌తో పరిటాల కుటుంబ సభ్యులు

image

మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతల విందులో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ దంపతులు పాల్గొన్నారు. విందు స్వీకరించి నియోజకవర్గ సమస్యలను మంత్రికి వివరించారు. అనంతరం పరిటాల సునీత, శ్రీరామ్ సతీమణి జ్ఞానకు నారా లోకేశ్ పట్టు చీరలు అందజేశారు.

News February 19, 2026

‘మార్చి 31లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి’

image

అనంతపురం జిల్లాలో వివిధ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆర్అండ్‌బీ, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్‌హెచ్‌ఎం స్కీం పనులు సకాలంలో పూర్తి చేయకపోతే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నాణ్యతతో పనులను గడువులోగా ముగించాలని అధికారులకు సూచించారు.