News November 19, 2025
కగార్ ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి: సీపీఐ

కగార్ ఆపరేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న మావోయిస్టుల ఎన్‌కౌంటర్లన్నింటిపైనా న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్తో కలిసి ఆయన ఈ మేరకు తెలిపారు.
Similar News
News November 21, 2025
ఆటో ప్రయాణికుల భద్రతకు ‘అభయ్’ యాప్: ఎస్పీ

ఆటో ప్రయాణికుల భద్రతను బలపరిచేందుకు ‘అభయ్’ యాప్ ని ప్రారంభించినట్లు మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. జిల్లాలోని 1,281 ఆటోలకు ‘మై టాక్సీ సేఫ్’ అనే అభయ్ యాప్‌కు సంబంధించిన క్యూఆర్ కోడ్ అమర్చామన్నారు. అలాగే, ఆటో డ్రైవర్లను సంస్థతో అనుసంధానం చేసి, రూ.350 ప్రీమియంతో ప్రమాదంలో మరణానికి రూ. లక్ష బీమా అందే విధంగా ఏర్పాటు చేశారు.
News November 21, 2025
చౌడేపల్లె: నీటిలో దూకి తల్లీబిడ్డ ఆత్మహత్య

చిత్తూరు(D) చౌడేపల్లె మండలంలో విషాదం నెలకొంది. వెంగళపల్లికి చెందిన ఆదిలక్ష్మికి 8నెలల కుమార్తె ఉంది. చిన్నారి హార్ట్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. హైదరాబాద్‌తో పాటు చాలాచోట్ల చికిత్స అందించారు. పాప ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆ తల్లి మనస్తాపానికి గురైంది. బిడ్డతో కలిసి ఆదిలక్ష్మి గ్రామ సమీపంలోని చెక్ డ్యాంలో శుక్రవారం దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లీబిడ్డ మృతదేహాలను చూసి గ్రామస్థులు విలపించారు.
News November 21, 2025
ఇద్దరు హోంగార్డుల మధ్య గొడవ.. సీరియస్ యాక్షన్ తీసుకున్న ప్రకాశం ఎస్పీ!

క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ ఇద్దరు హోంగార్డులను విధుల నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దారవీడుకు చెందిన హోంగార్డ్ యాసిన్, దోర్నాలకు చెందిన ప్రశాంత్ కుమార్, వెలిగండ్లకు చెందిన బాలసుబ్రమణ్యం విధుల నిమిత్తం 19న ఒంగోలుకు వచ్చి విశ్రాంతి కోసం గదిని తీసుకున్నారు. ప్రశాంత్, సుబ్రహ్మణ్యం గొడవ పడగా, ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.


