News December 17, 2025
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు: కామారెడ్డి జిల్లా ఎస్పీ

ఈనెల 17వ తేదీన జరిగే మూడో విడత స్థానిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కామారెడ్డి పోలీస్ సిబ్బంది పటిష్ఠంగా పోలింగ్ నిర్వహించనున్నట్టు జిల్లా ఎస్పీ రాజేంద్ర చంద్ర తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 812 మంది పోలీసుల సిబ్బందితో ఐదంచెల భద్రత ఏర్పాటు చేశామని, అలాగే 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 37 రూట్ మొబైల్ పార్టీలు, 25 ఎఫ్ఎస్టీ బృందాలు, 5 ఎస్ఎస్టీ బృందాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News December 17, 2025
కాకినాడ: పథకాల అమలుకు ఈ గణాంకాలే ప్రామాణికం

జిల్లాలో ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే-2025’ కొనసాగుతోంది. ఈ నెల 15న ప్రారంభమైన ఈ ప్రక్రియలో సచివాలయ సిబ్బంది ఆర్థిక, సామాజిక వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. 100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేయడంతో పాటు విద్య, ఉపాధి, ఆస్తుల మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే నెల 12 నాటికి సర్వేను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో సంక్షేమ పథకాల అమలుకు ఈ గణాంకాలే ప్రామాణికం కానున్నాయి.
News December 17, 2025
గుడిహత్నూర్: స్కూటీపై వచ్చి ఓటేసిన 85 ఏళ్ల బామ్మ

గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ 85 ఏళ్ల బామ్మ ప్రజాస్వామ్యంపై తనకున్న మక్కువను చాటుకున్నారు. వయసు భారంతో ఉన్న శారీరక ఇబ్బందులను లెక్కచేయకుండా, ఆమె స్వయంగా స్కూటీపై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె స్ఫూర్తిని చూసి స్థానికులు, ఎన్నికల సిబ్బంది అభినందనలు తెలిపారు. ఓటు హక్కు ప్రాముఖ్యంపై ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచారని అధికారులు పేర్కొన్నారు.
News December 17, 2025
నెల్లూరు: ప్రాణాలు పోతున్నా.. చలించరా..?

ప్రాణాపాయం కేసులను ఒకవేళ అడ్మిట్ చేసుకుంటే చికిత్సలో ప్రాణాలు పోతే తమపైకి వస్తుందేమోననే నెపంతో వైద్యులు రిస్క్ తీసుకోకుండా రెఫర్ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో వసతులు, వైద్యుల కొరత ఉండడంతో GGHకి రెఫర్ చేస్తున్నారు. జిల్లాలో 108 ద్వారా వచ్చిన అత్యవసర కేసులు పరిశీలిస్తే Sep (3063),OCT(3340), NOV(3024), DEC(559) రాగా.. వీటిల్లో SEP(496), OCT(573), NOV(662), DEC(157) కేసులను వేరే ఆసుపత్రులకు రెఫర్ చేశారు.


