News November 22, 2024

కడపలోని ఏపీజీబీని అమరావతికి తరలించవద్దు 

image

కడప నగరం కేంద్రంగా ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అమరావతికి తరలిపోతుందని వార్త జిల్లావ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న తరుణంలో గురువారం సీఎం చంద్రబాబును కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ బ్యాంక్‌ను కడప కేంద్రంగానే కొనసాగించాలని ఉద్యోగులు, ప్రజల తరుపున విన్నవించారు. గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ బ్యాంక్‌ను ఎట్టి పరిస్థితుల్లో తరలించవద్దన్నారు.

Similar News

News November 21, 2024

కడప: ప్రాధాన్యత రంగాలను పటిష్ఠం చేయాలి

image

ప్రాధాన్యతా రంగాలను పటిష్ఠం చేస్తేనే కడప జిల్లా అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆ దిశగా ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరకూరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలు, పనుల పురోగతి, సాధించిన ప్రగతి తదితర అంశాలపై కలెక్టర్ సంబందిత అధికారులతో సమీక్షించారు.

News November 21, 2024

కడప జిల్లాలో దారుణ ఘటన

image

కడప జిల్లాలో గురువారం దారుణ ఘటన వెలుగుచూసింది. కాశినాయన మండలం చెన్నవరం – పాపిరెడ్డిపల్లి మధ్యలో 30 నుంచి 35 ఏళ్ల వయస్సు గల మహిళపై దుండగులు రాళ్ళతో దాడి చేసి చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రాళ్లతో తలను ఛిద్రం చేశారు. మహిళపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News November 21, 2024

ఉత్కంఠ రేపుతున్న వైఎస్ వివేకా హత్య కేసు

image

YS వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ స్పీడ్ అందుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వివేకా కుమార్తె YS సునీత CM చంద్రబాబుని కలిసి దీనిపై చర్చించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న MP అవినాశ్‌ రెడ్డికి ఇటీవల సుప్రీంకోర్టు నోటీసులు సైతం జారీ చేసింది. వివేకా PA కృష్ణారెడ్డి ఇంటికి విచారణ కోసం పోలీసులు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.