News January 27, 2026

కడపలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్‌చల్.!

image

వారంరోజులుగా దేవుని కడప ఉత్సవాల్లో పోలీసులు బిజీగా ఉన్నారు. ఇదే అదునుగా చేసుకున్న దొంగలు రెచ్చిపోయారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని కడపలోని అన్ని PSల పరిధిలో 10 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. రిమ్స్ పరిధిలో శిల్పారామం, చిన్నచౌక్ పరిధిలోని YSR కాలనీ, వన్ టౌన్ పరిధిలోని 4 ఇళ్లలో చోరీలు చేశారు. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గమనించి దొంగలను వెంబడించగా అతనిపై రాళ్లు విసిరి పరారయ్యారు.

Similar News

News February 20, 2026

ఏయూ గేటు వద్ద ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన

image

ఆంధ్రా యూనివర్సిటీలో ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేసిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ యూనివర్సిటీ గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. వందేమాతరం పాడడం తప్పా.. భారతమాతకు జై అనడం తప్పా.. అంటూ ఏబీవీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. వీసీకి ఫిర్యాదు చేయాలే గానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని దాడి చేయడం తగదన్నారు. వారిని అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించమని పేర్కొన్నారు.

News February 20, 2026

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: డీఐఈఓ

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను బోర్డు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ అధికారులను ఆదేశించారు. హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.

News February 20, 2026

రాష్ట్రంలో వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని RTGS అంచనా వేసింది. సెంట్రల్ ఆంధ్ర, ఉత్తర కోస్తా, ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.