News May 15, 2024

కడపలో జూన్ 4 వరకు 144 సెక్షన్

image

కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈనెల 14వ తేదీ ఉదయం నుంచి జూన్ 4వ తారీకు వరకు జిల్లా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ (జిల్లా కలెక్టర్) జారీ చేసిన 144 సెక్షన్ అమలులో ఉంటుందని కడప డీఎస్పీ ఎం.డి షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు – 2024 నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించడానికి, ఎన్నికల నిర్వహణలో అవాంఛనీయ ఘటనలను నివారించడం కోసం 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

Similar News

News July 11, 2025

ప్రొద్దుటూరు: రూ.కోట్లతో రామేశ్వరం బ్రిడ్జి నిర్మాణం.. అటవీ శాఖ అభ్యంతరం

image

రామేశ్వరం బ్రిడ్జి నిర్మాణానికి అటవీశాఖ నుంచి బ్రేక్ పడింది. అప్రోచ్ రోడ్లు RFలోకి వస్తున్నాయంటూ అభ్యంతరం తెలిపింది. స్థానిక రామేశ్వరం పెన్నా నదిపై రూ.53కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. MDR గ్రాంట్ స్కీమ్ నిధులతో ప్రొద్దుటూరు- RTPP మార్గంలో R&B బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే సుమారు 65% పనులు పూర్తయ్యాయి. ఇంకా అప్రోచ్ రోడ్లు నిర్మించాల్సి ఉంది. కాగా ప్రస్తుతం పనికి బ్రేక్ పడింది.

News July 11, 2025

కడప: ట్రాఫిక్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు

image

కడప జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్పీ అశోక్ కుమార్ సిబ్బందికి సూచించారు. ఆధ్యాధునిక సాంకేతికతతో రూపొందించిన బైకులను ఎస్పీ శుక్రవారం ప్రారంభించారు. సైరన్, బ్లింకర్స్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, క్రౌడ్ కంట్రోల్ చేసే సదుపాయాలు ఈ వాహనాల్లో ఉన్నాయి. కడపకు 7, ప్రొద్దుటూరుకు 4, పులివెందులకు 2, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలుకు ఒకొక్కటి చొప్పున నూతన వాహనాలు కేటాయించారు.

News July 11, 2025

ప్రొద్దుటూరు: 159 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు

image

ప్రొద్దుటూరులోని రామేశ్వరం పురపాలక ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో 159 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు ఉన్నారు. ఇక్కడ ఐదు తరగతులు ఉన్నాయి. నెల కిందట ఇక్కడ HM, ఆరుగురు టీచర్లు ఉండేవారు. బదిలీల తర్వాత ఇక్కడ ఇప్పుడు HM ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. టీచర్ల కొరతపై MEO దృష్టికి తీసుకెళ్లామని HM వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. టీచర్ల సర్దుబాటు తన పరిధిలో లేదని MEO సావిత్రమ్మ తెలిపారు.