News August 15, 2025

కడపలో జెండా ఎగురవేసిన మంత్రి ఫరూక్

image

స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు కడప నగరంలో నిర్వహించారు. పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి మంత్రి ఫరూక్ హాజరై జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై తన సందేశంలో ప్రజలకు వినిపించారు.

Similar News

News August 15, 2025

జెండా ఎగురవేసిన కడప కలెక్టర్

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కడప జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ శ్రీధర్ జాతీయ జెండాను ఎగరవేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం జాతీయ జెండా ఎగురవేసి అధికారులకు సిబ్బందికి ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగ ఫలితంతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు.

News August 14, 2025

ఎడ్ల బండిని ఢీకొని ద్విచక్ర వాహనదారుడి మృతి

image

బ్రహ్మంగారిమఠం మండలం నరసన్నపల్లెకు చెందిన దేవరకొండ నరసయ్య యాదవ్ (42) స్కూటర్‌పై వెళ్తూ ఎడ్ల బండిని ఢీకొట్టాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అదే గ్రామానికి చెందిన సోమిరెడ్డి పల్లె నరసయ్య ఎడ్ల బండిపై పొలం వెళ్తుండగా నరసయ్య యాదవ్ స్కూటర్‌పై వేగంగా వెళ్తూ బండిని ఢీ కొట్టాడు. చికిత్స నిమిత్తం పొద్దుటూరుకి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు.

News August 14, 2025

పులివెందుల ఎన్నిక: కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు

image

ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా కడపలో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ అశోక్ కుమార్ సారథ్యంలో దాదాపు 500 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల వరకు బయటి వ్యక్తులను అనుమతించడం లేదు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.