News June 19, 2024
కడపలో పోలీసుల పై కరపత్రాల కలకలం

కడప నగరంలో ఓ పోలీస్ స్టేషన్‌లో పోలీసు అధికారులు సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన వారి నుంచి డబ్బులను తీసుకుని సిబ్బందికి పంపిణీ చేయకుండా అవినీతికి పాల్పడ్డారంటూ గుర్తు తెలియని వ్యక్తులు ‘కరపత్రాలు’ ముద్రించి రాత్రి వేళల్లో పంపిణీ చేశారు. ఈ సంఘటన పోలీసు అధికారుల్లో అసహనం, ప్రజల్లో కలకలం రేపింది. ఈ సంఘటనపై ఎవరు కరపత్రాలను తయారు చేశారు? ఎవరు పంపిణీ చేశారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
Similar News
News July 6, 2025
రైతులకు అవగాహన కల్పించండి: కడప కలెక్టర్

కడప జిల్లాలో ఈనెల 14వ తేదీ వరకు జరిగే పశుగ్రాస వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. పశుగ్రాస వారోత్సవాల గోడపత్రికలను ఆయన కడపలో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పశుగ్రాసాలను సాగు చేసి రైతుల ఇంట సిరుల పండించేలా చూడాలన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పశుగ్రాసాల సాగు ఎంతో ఉపయోగకరమని ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
News July 6, 2025
వేంపల్లి: ట్రాక్టర్ ఢీ.. 50 గొర్రెలు మృతి

కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లి- తాళ్లపల్లి మధ్యలో ట్రాక్టర్ ఢీకొని 50 గారెలు మృతి చెందినట్లు సమాచారం. ఈ గొర్రెలు తాటిమాకులపల్లె ఎస్సీ కాలనీకి చెందిన వారివిగా గుర్తించారు. వీరంతా తాళ్లపల్లిలో మేపుకోసం వెళ్తున్నారు. అటుగా స్పీడుగా వచ్చిన ట్రాక్టర్ గొర్రెలను ఢీకొనగా అక్కడికక్కడే 50 గొర్రెలు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 6, 2025
పోరుమామిళ్ల: నకిలీ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు

పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లెకి చెందిన ఓ యువతి సత్యసాయి జిల్లా తుమ్మలవారిపల్లెకి చెందిన భాను ప్రకాశ్‌ను 7 నెలల క్రితం వివాహం చేసుకుంది. అతను హైదరాబాదులో AR కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించి మోసం చేసి వివాహం చేసుకున్నాడని యువతి తెలిపింది. అంతేకాకుండా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శనివారం పోరుమామిళ్ల PSలో ఫిర్యాదు చేసింది.