News November 19, 2025
కడపలో సీఎం పర్యటన ఇలా.!

ఇవాళ పెండ్లిమర్రిలో ఏర్పాటు చేసిన PM కిసాన్, అన్నదాత సుఖీభవ 2వ విడత నిధుల విడుదల కార్యక్రమానికి CM చంద్రబాబు రానున్నారు. ఆయన పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు.
☛ 1:25PM: పెండ్లిమర్రి (M) వెల్లటూరులోని హెలిప్యాడ్ వద్దకు వస్తారు
☛ 1:40 PM-4 PM: ప్రజావేదికలో ప్రసంగం
☛ 4:20 PM-5:05 PM: రైతులతో మాట్లాడతారు
☛ 5:15 PM- 6:15 PM: కార్యకర్తలతో మీటింగ్
☛ 6:50 PM: విజయవాడకు తిరుగు పయనమవుతారు.
Similar News
News April 5, 2026
తిరుపతి: దరఖాస్తుల గడువు పొడిగింపు

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో 2026 సంవత్సరానికి Ph.D/ M.S(Research) ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/admissions వెబ్ సైట్ చూడాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 13.
News April 5, 2026
మాడుగుల: ఒకే బైక్‌పై ఐదుగురు.. యాక్సిడెంట్‌తో తీవ్ర గాయాలు

మాడుగుల మండలం ఎం.కోటపాడు జంక్షన్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు యువకులు గాయపడ్డారు. పరిమితికి మించి ఒకే బైక్ మీద ఐదుగురు యువకులు కాశీపురం నుంచి ఎం.కోటపాడు వస్తూ నిలిపి ఉన్న బొలెరోని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిలో ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉందని,108లో ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.
News April 5, 2026
ధురంధర్-2ను వీక్షించిన పాక్ మాజీ ప్రధాని?

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ధురంధర్-2 సినిమా కాపీని తెప్పించుకొని వీక్షించినట్లు ఆ దేశానికి చెందిన జర్నలిస్టు ఖలీద్ వెల్లడించారు. అందులో తన పాత్రను తీర్చిదిద్దిన విధానాన్ని ఆయన మెచ్చుకున్నట్లు తెలిపారు. పాక్‌లో ఈ చిత్రంపై నిషేధం విధించినప్పటికీ తాను తొలి రోజే చూసినట్లు ఖలీద్ గతంలో చెప్పారు. కాగా ధురందర్-2లో నవాజ్ పాత్రను మషూర్ అమ్రోహి పోషించారు. క్యాస్టింగ్ పర్‌ఫెక్ట్‌గా సెట్టవడం విశేషం.


