News December 7, 2024
కడపలో Pic Of The Day

పేరెంట్- టీచర్స్ మీటింగ్‌లో పాల్గొనేందుకు కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు పోలీస్ సెక్యూరిటీ స్నిఫర్ డాగ్ ‘లూసి’ గౌరవ వందనం చేసింది. ఆయన దానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఆకట్టుకుంటోంది. కాగా ఈ జాగిలం పేలుడు పదార్థాలను గుర్తించడంలో ప్రావీణ్యం పొందింది.
Similar News
News January 22, 2026
జాతీయ స్థాయి ఇస్తేమాకు భారీ భద్రత: కడప ఎస్పీ

కడప నగర శివార్లలోని కొప్పర్తి పరిసర ప్రాంతాలలో ఈనెల 23, 24, 25 తేదీలలో నిర్వహించనున్న ఇస్తేమా కార్యక్రమానికి భారీ బందోబస్తును ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ పర్యవేక్షణలో పోలీసు శాఖ నిర్వహించనుంది. 6 మంది డీఎస్పీలు, 32 మంది సీఐలు, 55 మంది ఎస్ఐలు, ఇంకా ఇతర సిబ్బందితో కలిపి 700 మంది మన జిల్లాకు సంబంధించిన వారు బందోబస్తు విధులను నిర్వహించనున్నారు. ఇంకా పక్క జిల్లాల నుంచి బందోబస్తుకు రానున్నారు.
News January 22, 2026
కడప: ‘ఇసుక రీచులు, స్టాక్ పాయింట్లపై పర్యవేక్షణ’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇసుక పంపిణీ ప్రక్రియ సజావుగా జరగాలని, ఇసుక రీచులపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో ఇసుక బుకింగ్, సరఫరా, ఇసుక లభ్యత, నూతన ఇసుక రీచ్‌ల గుర్తింపు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి సాండ్ కమిటీ (డీఎల్ఎస్సీ) సమావేశం నిర్వహించారు.
News January 22, 2026
కడప: ‘పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి’

కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో డీఎంఎఫ్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి, నిర్మాణ పనుల పురోగతిపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి రెండవ వారంలోగా పనులను పూర్తి చేయాలని కోరారు.


