News September 22, 2024
కడప: అతివేగానికి నిండు ప్రాణం బలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92024/1726997205313-normal-WIFI.webp)
కడప జిల్లా మాధవరం -1 పార్వతిపురం గంగమ్మ గుడి దగ్గర రోడ్డు దాటుతున్న నారాయణ సుబ్బలక్ష్మమ్మ అనే మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే యువకుడు శనివారం రాత్రి బైక్‌పై వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆమెను కడప రిమ్స్‌కు తరలించగా చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. పోలీస్‌లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 22, 2024
రాయచోటిలో కాల్పుల కలకలం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734833269422_60263330-normal-WIFI.webp)
అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి రాయచోటి మండలం మాధవరంలో ఈరోజు ఉదయం దుండగులు ఇద్దరు వ్యాపారులపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో స్థానికులు బాధితులను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News December 22, 2024
జనవరి 29 నుంచి దేవుని కడప శ్రీవారి బ్రహ్మోత్సవాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734767183951_60263330-normal-WIFI.webp)
తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు తిరుమలలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జనవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. జనవరి 29వ తేదీ ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
News December 21, 2024
కడప: 1991 నాటి YS జగన్ ఫొటో వైరల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734766431884_52218543-normal-WIFI.webp)
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇంటర్నెట్లో ఓ ఫొటో వైరల్ అవుతుంది. 1991లో జగన్ తీసుకున్న ఫొటో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన స్థానికంగా ఉన్న వ్యక్తితో ఫొటో దిగగా తాజాగా ఆ ఫొటో బయటకు వచ్చింది. శనివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ అభిమాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్టును ఆయన అభిమానులు షేర్ చేస్తున్నారు.