News November 22, 2024

కడప: అధికారులు ప్రాథమిక విధులు విస్మరించరాదు.!

image

రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ భూముల కేటాయింపు విషయంలో ప్రాథమిక విధులను విస్మరించకుండా SOP ప్రకారం బాధ్యతలను నిర్వహించాలని, కడప జిల్లా కలెక్టర్‌ శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ విషయాలపై శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. భూముల రీ సర్వే, భూ రికార్డుల స్వచ్చీకరణ, ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్, భూసేకరణ రెవెన్యూ శాఖలో పెండింగ్ అంశాలు తదితర అంశాలపై చర్చించారు.

Similar News

News November 23, 2024

నిమ్మ పంటను పరిశీలించిన కడప జిల్లా కలెక్టర్

image

పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కలసపాడు తహశీల్దారు కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం మండలంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పనులపై అరా తీశారు. అనంతరం తెల్లపాడు గ్రామపంచాయతీ దూలంవారిపల్లిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద లబ్ధి పొందిన రైతు పొలంలో పర్యటించారు. కొమ్ముల హరి అనే రైతు సాగు చేసిన నిమ్మ పంటను సూసి సంతోషించారు.

News November 22, 2024

జగన్‌ను ఒక్క సారైనా అసెంబ్లీకి రప్పించండి: ఎమ్మెల్యే ఆది

image

జగన్‌ అవినీతిలో ఎస్కోబార్‌ను కూడా దాటేశారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘జగన్‌ను నేను దగ్గర నుంచి చూశా. అతను రాజశేఖర్ రెడ్డి హయాంలోనే రూ.లక్ష కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఇంకా పెరిగిపోయి ఉంటుంది‘ అని తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం ఆ జగన్‌ను ఒక్కసారైనా అసెంబ్లీకి రప్పించండి అని ఆదినారయణ రెడ్డి అనగానే సభ్యులతో పాటు సీఎం చంద్రబాబు సైతం నవ్వుకున్నారు.

News November 22, 2024

ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రశ్న.. గందరగోళంగా మారిన సభ

image

వైసీపీ హయాంలో అమలు చేసిన ఈబీసీ నేస్తం లాంటి పథకాలు ఇప్పుడేమైనా ఇస్తారా? అని YCP ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి శాసనమండలిలలో ప్రశ్నించారు. దీనిపై మంత్రి సవిత మాట్లాడుతూ.. ‘మేము అగ్రవర్ణ పేదల అభివృద్ధికి కృషిచేస్తున్నాం. వైసీపీ వారిని పట్టించుకోలేదు. బటన్ నొక్కడమే తప్ప ఉపాధి కల్పించలేదు. దీంతో గంజాయికి అలవాటు పడ్డారు’ అని అనడంతో YCP నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.