News March 26, 2025

కడప: అనుమానంతో భార్యను చంపిన భర్త

image

వల్లూరు(M) అంబవరంలో భార్యను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. ఎర్రగుడిపాడుకు చెందిన చెన్నకేశవ, సుజాతకు పెళ్లై ముగ్గురు సంతానం. చెన్నకేశవ తాగుడుకు బానిసై భార్యపై అనుమానం పెంచుకొని వేధించేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. సుజాతను పెద్దకొడుకు పనినిమిత్తం అంబవరానికి పిలుచుకొచ్చాడు. మంగళవారం సుజాతపై చెన్నకేశవ కొడవలితో దాడి చేసి చంపాడు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News March 29, 2025

30 తరాలైన YCP గెలవదు: ఆదినారాయణ రెడ్డి

image

జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కాశినాయన ఆశ్రమానికి 23 హెక్టార్ల స్థలం కావాలని 2023లో నేను లేఖ రాస్తే YCP ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలో మరోసారి కేంద్ర అటవీ శాఖ మంత్రికి మేము రిక్వెస్ట్ చేస్తే 13ఎకరాలు ఇస్తామని ఆయన చెప్పారు. డైనోసార్‌లాగా వైసీపీ కాలగర్భంలో కలిసిపోయింది. 30ఏళ్లు కాదు కదా.. 30 తరాలైన వైసీపీ గెలవదు’ అని ఢిల్లీలో ఎమ్మెల్యే అన్నారు.

News March 29, 2025

కడప జిల్లాలో ప్రాణం తీసిన బెట్టింగ్

image

బెట్టింగ్ భూతానికి కడప జిల్లాలో ఓ యువకుడు బలయ్యాడు. ప్రొద్దుటూరులో పట్టణంలోని రామేశ్వరానికి చెందిన యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. ఏకంగా రూ.8 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. 1-టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
NOTE: ఐపీఎల్, ఆన్‌లైన్, ఇతర ఏ బెట్టింగ్‌ జోలికి వెళ్లకండి

News March 29, 2025

కడప: కాంగ్రెస్ పార్టీకి అఫ్జల్‌ఖాన్ రాజీనామా

image

కడప జిల్లాలో మరొక కీలక నేత రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ కడప నగర అధ్యక్షుడు అఫ్జల్‌ఖాన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన తన రాజీనామా లేఖను షర్మిలకు పంపారు. అనివార్య కారణాలతో పార్టీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. గతంలో వైసీపీలో ఉన్న ఆయన ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 25 వేల ఓట్లు సాధించారు. ఈక్రమంలో ఇక్కడ వైసీపీ ఓడిపోయింది.

error: Content is protected !!