News August 5, 2025
కడప: అన్నాచెల్లెళ్లకు కానిస్టేబుల్ జాబ్స్

కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాల్లో కడప పరిధిలోని అరుందతి నగర్‌కు చెందిన అన్నాచెల్లెళ్లు మధుమోహన్, లలితాదేవిలు సత్తా చాటారు. వారధి ఓబులేసు, రామలక్షుమ్మల ఇద్దరు సంతానం కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒకే కుటుంబంలోని అన్నాచెల్లెళ్లకు పోలీస్ జాబ్స్ రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కాగా కడప ఆకాశవాణిలో మధు మోహన్ క్యాజువల్ అనౌన్సర్‌గా, లలితాదేవి యువవాణి కాంపియర్‌గా పనిచేస్తూ ప్రిపేర్ అయ్యారు.
Similar News
News September 9, 2025
పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు: కలెక్టర్

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు విధిగా వేయించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాలో 3,71,400 డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 4 నెలలు వయస్సు దాటిన పశువులకు టీకాలు వేయించాలన్నారు.
News September 9, 2025
కడప: ఉల్లి కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

ఉల్లి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేసిందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. సోమవారం యూరియా సరఫరా, ఉల్లి పంట కొనుగోలుపై CM, CSలతో VC సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఉల్లి కొనుగోలు కోసం కమలాపురం, మైదుకూరులలో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 4 నుంచి ఉల్లిపంట కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. యూరియాపై రోజువారీ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.
News September 8, 2025
కడప జిల్లాలో 11,628 ఎకరాల్లో ఉల్లి సాగు

కడప జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 11,628 ఎకరాల్లో రైతులు ఉల్లిపంట సాగు చేశారు. వీరపునాయునిపల్లె, మైదుకూరు, దువ్వూరు, వేముల, తొండూరు, వేంపల్లి, ముద్దనూరు మండలాల్లో ఎక్కువగా ఉల్లిపంటను సాగు చేశారు. ఈనెల 10కి 655 ఎకరాల్లో, 17కి 1,265, 24కి 3,674, అక్టోబర్ 1కి 3,206, అక్టోబర్ 7కి 2,828 ఎకరాల్లో ఉల్లి పంట కోతకు వస్తుందని ఉద్యానశాఖ DD రవిచంద్ర తెలిపారు.