News December 29, 2024

కడప: అప్పులకు ముచ్చటైన ఫ్యామిలీ బలి..!

image

వాళ్లదో చిన్న కుటుంబం. భార్యాభర్త, ఇద్దరు పిల్లలు. ఉన్నంతలో సంతోషంగా జీవితం గడిపారు. ఇటీవలే ఇంట్లో అమ్మాయికి ఫంక్షన్ కూడా చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి ముచ్చటగా ఫొటో దిగారు. ఆ సంతోషం ఎక్కువ రోజులు మిగల్లేదు. అన్ని మధ్య తరగతి కుటుంబాల్లో మాదిరిగానే ఆ ఇంటిని అప్పు పలకరించింది. అది తలకు మించిన భారంగా మారి చావు ఒక్కటే మార్గమనేలా చేసింది. అంతే ఆ పెద్దకు ఏమీ తోచలేదు. అందరికీ <<14999995>>ఉరి వేసి<<>> తానూ చనిపోయాడు.

Similar News

News December 30, 2024

కమలాపురంలో రైలు కిందపడి మహిళ మృతి

image

కమలాపురంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. గుర్తుతెలియని ఓ మహిళ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ కమలాపురం రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళుతుంది. ఈ క్రమంలో రైలు వచ్చి ఢీకొట్టడంతో కిందపడింది. స్థానికులు అక్కడికి చేరుకొని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 30, 2024

‘పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలి’

image

కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి నిర్మాణ పనుల పురోగతిపై ఆయా శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా మినరల్ ఫండ్ ద్వారా నిర్మిస్తున్న వివిధ రకాల పెండింగ్ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలన్నారు.

News December 30, 2024

కడప జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ సస్పెండ్

image

కడప జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గురునాథ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్‌గా వున్న గురునాథ్‌ ఎస్ఐ అని చెప్పుకొంటూ ప్రజలను బెదిరించడం, సక్రమంగా విధులు నిర్వర్తించకుండా ఉండటంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వారు అందించిన నివేదిక ప్రకారం అతనిపై ఎస్పీ వేటు వేశారు