News October 16, 2024

కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం

image

కడప నగరంలో నవంబర్ 16 నుంచి 20 వరకు జరగనున్న కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడుని దర్గా పెద్దలు ఆహ్వానించారు. సచివాలయంలో సీఎంను మంగళవారం కలిసి దర్గా ముతావల్లి ఖ్వాజా స‌య్య‌ద్ షా ఆరిఫుల్లా హుస్సేనీ ఆహ్వాన పత్రిక అందించారు. సీఎం సానుకూలంగా స్పందించారని మత పెద్దలు తెలిపారు.

Similar News

News December 21, 2024

కడప జిల్లాకు క్యూ కట్టిన మంత్రులు

image

కడప జిల్లాకు రాష్ట్ర, కేంద్ర మంత్రులు క్యూ కట్టారు. ఆదివారం నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మలరామానాయుడు గండికోట ప్రాజెక్టును సందర్శించనున్నారు. అలాగే పర్యాటకం, సాంస్కృతికం, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జమ్మలమడుగు, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె మండలాల్లో పర్యటించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు.

News December 21, 2024

ఆకాంక్ష జిల్లాల లక్ష్య సాధనకు కృషి చేయాలి: కడప కలెక్టర్

image

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను కడప జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసే ఆకాంక్షతో జిల్లాల లక్ష్య సాధనకు కృషి చేయాలని, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పురోగతిపై సంబంధిత జిల్లా కలెక్టర్లతో నీతి ఆయోగ్ సీఈవో వీసీ ద్వారా శుక్రవారం సమీక్షించారు. సంబందిత శాఖలు అన్ని పారామీటర్లు 100% లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు.

News December 21, 2024

22న కడపకు మంత్రి కందుల రాక

image

రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఈనెల 22న కడపకు వస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. రాజమండ్రి నుంచి ఆయన రైలు మార్గాన ఆదివారం ఉదయం కడపకు చేరుకుంటారు. మేడా ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి సాయంత్రం తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి రాజమండ్రికి వెళ్తారు.