News March 22, 2025
కడప: అయ్యో.. ఈమె కష్టం ఎవరికీ రాకూడదు

కడప జిల్లా ముద్దనూరు(M)లో ఓ మహిళ గాథ కన్నీటిని తెప్పిస్తోంది. మండలంలోని ఉప్పలూరుకు చెందిన గోవిందు శ్యామల భర్త లక్ష్మయ్యను ఏడాది క్రితం పాము కాటు వల్ల కోల్పోయింది. ఈమెకు ఇద్దరు ఆడ సంతానం. కుటుంబ పోషణ కోసం స్కూల్‌లో వంట మనిషిగా పనిచేస్తోంది. శుక్రవారం తన చిన్న కుమార్తె కీర్తన(6) కారు ప్రమాదంలో మృతి చెందింది. ఆమెను చూసిన గ్రామస్థులు అయ్యో దేవుడా ఎంతా పని చేశావని కన్నీటి పర్యంతం అయ్యారు.
Similar News
News March 22, 2025
కడప: కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తులు

కడప జిల్లాలోని 17 మండలాల్లోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో అర్హులైన విద్యార్థుల ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా సమగ్ర శిక్షా అకాడమిక్ మానిటరింగ్ అధికారి వీరేంద్ర తెలిపారు. జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టు అధికారి నిత్యానందరాజు ఆదేశాల మేరకు కేజీబీవీలలో 6 నుంచి ఇంటర్ వరకు చదివేందుకు అర్హులైన బాలికలు నేటి నుంచి ఏప్రిల్ 12లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 22, 2025
కడప: ‘వైసీపీ నేత రూ.2 కోట్ల భూమి కబ్జా చేశాడు’

కడప జిల్లా ఒంటిమిట్ట మండలానికి చెందిన వైసీపీ నేత రూ.2 కోట్ల భూమి కబ్జా చేశాడని టీడీపీ నేత ఆలూరి నరసింహులు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తమాధవరం మాజీ సర్పంచ్ ఫేక్ డాక్యుమెంట్లతో రూ.2 కోట్ల విలువైన భూమిని ఆక్రమించి, అక్కడ హోటల్ కడుతున్నాడని ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని శుక్రవారం ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో, అలాగే మంత్రిని కలిసి ఫిర్యాదు చేశాడు.
News March 22, 2025
కడప: ఈ-కేవైసీ చేస్తేనే రేషన్ సరుకులు

ఈనెల 31వ తేదీ లోపు రేషన్ కార్డులు ఈకేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి జె.శిరీష తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుల్లో పెండింగ్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా ఈ నెల 31వ తేదీ నాటికి ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఈ కేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే ఏప్రిల్ నెల నిత్యావసర సరుకులు అందుతాయని తెలిపారు. సమీపంలోని చౌక దుకాణం /సచివాలయంలో వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలన్నారు.