News May 23, 2024
కడప: ఆ కాలేజ్‌కు వైవీయు గుర్తింపు లేదు

ప్రొద్దుటూరు శ్రీకృష్ణ గీతాశ్రమంలో ఉన్న శ్రీ మలయాళ స్వామి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేటి వరకు వైవీయు నుంచి ఎలాంటి గుర్తింపు లేదని విశ్వవిద్యాలయ కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్ డీన్ ఆచార్య కె. రఘుబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సదరు కళాశాలలో బీఈడీ ప్రవేశాలు పొందే విద్యార్థులకు విశ్వవిద్యాలయం ఎలాంటి బాధ్యత వహించదని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 18, 2025
కడప జిల్లాలో అస్థి పన్ను డిమాండ్ ఎన్ని కోట్లంటే..

కడప జిల్లాలో 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో అస్థి పన్ను బకాయిలు రూ.162.81 కోట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు రూ.64.78 కోట్లు (64.78%) మాత్రమే వసూలైంది. రూ. కోట్లల్లో KDP-100.80 గాను 37.65, PDTR-35.33గాను 13.17, PVLD-8.65 గాను 5.67, JMD-4 గాను 2.62, BDVL-2.73 గాను 2.11, YGL-5.01 గాను 1.87, MYDKR-5.17 గాను 1.36, KMLPRM-1.13 గాను 0.33 కోట్లు మాత్రమే వసూలైంది.
News December 18, 2025
స్మార్ట్ కిచెన్ అమలు భేష్.. కడప కలెక్టర్‌కు CM ప్రశంస.!

కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. కడప జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి విద్యార్ధులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రశంసించారు. స్మార్ట్ కిచెన్ అమలులో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని ప్రతి జిల్లా కలెక్టర్ కడప స్మార్ట్ కిచెన్ సందర్శించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
News December 18, 2025
Happy Birthday రాజా: YS షర్మిల

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు YS షర్మిల తన కుమారుడు రాజారెడ్డికి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నీ ఎదుగుదల, దైవచింతన, పట్టుదల నాకు గర్వకారణం. ఆరోగ్యంగా ఉంటూ మరిన్ని విజయాలు సాధించాలి’ అని ఆకాంక్షించారు. కుమారుడిపై ఆమె తనకున్న ప్రేమను చాటుకున్న ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.


