News March 13, 2025

కడప: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్

image

కడప జిల్లాలోని కాశినాయన క్షేత్రంలోని పలు షెడ్లను అటవీ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ, కూటమి నాయకులు వాడీవేడీగా మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ స్పందించి.. తన సొంత నిధులతో పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 24 గంటల్లో ఇచ్చిన మాట ప్రకారం.. నూతన షెడ్ల నిర్మాణం పనులను మొదలుపెట్టారు. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News February 28, 2026

కడప: ఇద్దరు MEOలు సస్పెండ్

image

ముద్దనూరు MEO-1 అన్నయ్య, కొండాపురం MEO-1 ఓబులేశును సస్పెన్షన్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముద్దనూరు మండలం చింతకుంట ఎంపీపీ స్కూల్‌లో గతంలో విధులు నిర్వర్తించిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరైనా కూడా MEOలు జీతాలు మంజూరు చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో MEOలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

News February 27, 2026

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి: జేసీ

image

జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని శుక్రవారం DIEPC సమావేశంలో జేసీ నిధి మీనా సంబంధిత అధికారులను ఆదేశించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 18 శాఖలకు సంబంధించి 11,033 దరఖాస్తులు వచ్చాయని, 10,886 దరఖాస్తులకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. 10,836 పరిశీలనలో, 50 పరిశీలనకు సిద్ధంగా ఉన్నాయన్నారు. 88 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందన్నారు. 59 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచడం జరిగిందన్నారు.

News February 27, 2026

బి.మఠం: మృతులు బద్వేలు వాసులుగా గుర్తింపు

image

బ్రహ్మంగారిమఠం మండలం నంది పల్లె పాల డైరీ వద్ద లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు <<19255263>>మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. మృతులు భార్యభర్తలు కావ్య, ప్రసాద్‌గా స్థానికులు గుర్తించారు.బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్తమ్మ నగర్‌లో నివాసం ఉంటున్నట్లుగా సమాచారం. వీరి తల్లిదండ్రులు బద్వేల్ మున్సిపాలిటీ కుమ్మరి కొట్టాలలో ఉన్నారని తెలుస్తోంది.