News September 25, 2025

కడప ఇన్‌ఛార్జ్‌ మేయర్‌గా ముంతాజ్ బేగం

image

కడప మేయర్ సురేశ్ బాబుపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇన్‌ఛార్జ్ మేయర్‌గా ముంతాజ్ బేగం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 41వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె ప్రస్తుతం డిప్యూటీ మేయర్‌గా పనిచేస్తున్నారు.

Similar News

News September 27, 2025

కడప జిల్లాలో పర్యాటక ప్రాంతాలు ఎన్నో.!

image

కడప జిల్లా అంటేనే పర్యాటక ప్రాంతాలకు నిలయం. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను నెమరువేసుకుందాం. గండికోట సోయగాలు జిల్లా వాసులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అంతేకాక సిద్ధవటంకోట, ప్రఖ్యాత అమీన్‌పీర్ పెద్దదర్గా, ఒంటిమిట్ట కోదండ రామునిదేవాలయం, ఇడుపులపాయ నెమళ్ళ పార్క్, దేవుని గడప వేంకటేశ్వరస్వామి, బ్రహ్మంగారిమఠం ఇలా ఎన్నో ఉన్నాయి. మరి ఈ దసరాకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు.

News September 27, 2025

మాజీ MLA రాచమల్లుపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.!

image

మాజీ MLA రాచమల్లుపై శుక్రవారం సాయంత్రం ప్రొద్దుటూరు 3వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వాల్మీకి సంక్షేమ సంఘం డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, స్థానిక టౌన్ బ్యాంక్ ఛైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డిలు సీఐ వేణుగోపాల్‌కు ఈ ఫిర్యాదు అందించారు. CM చంద్రబాబు, హిందూపురం MLA బాలకృష్ణ, TDP కార్యదర్శి కొండారెడ్డి, మాజీ MLC పుల్లయ్యలపై రాచమల్లు అనుచిత వ్యాఖ్యలు చేశారని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

News September 27, 2025

కానిస్టేబుల్ శిక్షణా ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

image

కడప జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ శుక్రవారం పరిశీలించారు. ఇటీవల ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్ల (ఎస్‌సీటీపీసీ) శిక్షణ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన తరగతి గదులు, వసతి గదులు, కార్యాలయాలు, మైదానం, పరిశీలించిన అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రకాశ్ బాబు, డీఎస్పీ అబ్దుల్ కరీం పాల్గొన్నారు.