News July 23, 2024
కడప ఉక్కు పరిశ్రమకు నిధులు వచ్చేనా?

కడప జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లగా ఉక్కు పరిశ్రమ స్థాపనకై ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రులు మారుతున్నా శంకుస్థాపనలకే పరిమితం అయిందనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు నిధులు కేటాయిస్తారో లేదో అని అని జిల్లా ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీరేమంటారు.
Similar News
News February 23, 2026
పులివెందులకు YS జగన్.. షెడ్యూల్ ఇదే.!

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 25న పర్యటించే షెడ్యూల్‌ను వైసీపీ వర్గాలు తెలిపాయి. ఉదయం 9:30 గంటలకి ఇంటి నుంచి బయలుదేరి 10:30కి వేంపల్లి మండలం నంది పల్లె నందీశ్వర ఆలయానికి చేరుకుంటారు. తిరిగి 11:30కి అక్కడి నుంచి బయలుదేరి 12:30కి బాకరాపురం చేరుకొని మధ్యాహ్నం 2:30 వరకు విశ్రాంతి తీసుకుంటారు. 2:30 నుంచి 6: 25 వరకు క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. 6:30కి ఇంటికి చేరుకొని అక్కడే బసచేస్తారు.
News February 23, 2026
ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరలు ఇలా

*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,750
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,490
*వెండి 10 గ్రాముల ధర రూ.2,700
News February 23, 2026
రాజంపేట: ఇంటర్ విద్యార్థికి యాక్సిడెంట్

పరీక్ష రాయాల్సిన విద్యార్థి ఆసుపత్రి పాలైన ఘటన ఇది. రాజంపేట డివిజన్ పిచ్చిగుంట్లపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థికి వీరబల్లిలో పరీక్షా కేంద్రం కేటాయించారు. ఇవాళ ఉదయం తన ఇంటి నుంచి బైకుపై పరీక్షా కేంద్రానికి బయల్దేరాడు. నీలవాండ్లపల్లి సమీపంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టి వెళ్లిపోయింది. రోడ్డుపై తీవ్ర గాయాలతో ఉన్న విద్యార్థిని గుర్తించి రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


