News November 16, 2024
కడప ఉరుసు మహోత్సవాలకు రానున్న ప్రముఖులు
కడప నగరంలోని పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జరగబోయే ఉరుసు మహోత్సవాలకి ప్రముఖ నటుడు ‘రామ్ చరణ్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్’ రానున్నారు. కాగా బుధవారం రోజు ప్రముఖ గాయకుడు మనో (నాగూర్ బాబు) దర్గాను దర్శించారు. నేడు జరగబోయే గంధ మహోత్సవంలో AR రెహమాన్, 18వ తేదీ ముషాయిరా కార్యక్రమానికి రామ్ చరణ్ వస్తున్నట్లు సమాచారం.
Similar News
News December 5, 2024
గండికోట పర్యాటక అభివృద్ధికి అడుగులు: కలెక్టర్
ప్రపంచ పర్యాటక మ్యాపులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గండికోట పర్యాటక ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గండికోట పర్యాటక అభివృద్ధిపై బుధవారం సమీక్షించారు. జిల్లాలో అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతమైన “గండికోట పర్యాటక కేంద్రం” భవిష్యత్తులో ప్రపంచ పర్యాటక రంగాన్ని శాసిస్తుందన్నారు.
News December 4, 2024
కడప జిల్లాపై లేని భూప్రకంపనల ప్రభావం
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు రావడం సంచలనంగా మారింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఎక్కడ ప్రమాదాలు జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ఉమ్మడి కడప జిల్లాలో ఎటువంటి ప్రకంపనలు రాకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మన జిల్లాలో ఎక్కడైనా భూప్రకంపనల ప్రభావం ఉంటే కామెంట్ చేయండి.
News December 4, 2024
కడప జిల్లాలో 829 మంది ప్రధానోపాధ్యాయులకు నోటీసులు
కడప జిల్లాలో పెద్ద ఎత్తున ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ అధికారి షోకాజ్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పాఠశాలల్లో పిల్లల అపార్ నమోదు పూర్తి చేయలేదని 829 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వకపోతే ప్రధానోపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.