News April 16, 2024
కడప: ఎల్లుండి నుంచి నామినేషన్ల స్వీకరణ

18న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో అదే రోజు నుంచి అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. అన్ని నియోజకవర్గాల ఆర్‌ఓలు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎక్కడా మోడల్ కోడ్ ఆఫ్ కాండెక్ట్ ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News September 6, 2025
కడప జిల్లా వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల పరిదిలోని బాగాదుపల్లె వినాయక చవితి ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. గత శుక్రవారం వినాయక చవితి సందర్భంగా ఊరేగింపు సమయంలో ప్రమాదవశాత్తు టపాసులు పేలి కుమ్మితి పాలకొండయ్య (35)కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108లో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.
News September 5, 2025
పులివెందులకు బై ఎలక్షన్ ఖాయం: రఘురామ

మాజీ సీఎం జగన్‌పై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చందమామ కోసం మారాం చేసినట్లుగా జగన్ ప్రతిపక్ష హోదా కోసం తాపత్రయపడుతున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ఆయన రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది. ఎమ్మెల్యేలు శాసనసభా సమావేశాలను బహిష్కరిస్తే ఆ పదవికి అర్హత లేనట్లుగా భావించాలి. అసెంబ్లీ ఉపసభాపతిగా సమావేశాలకు జగన్ రావాలని కోరుతున్నా.’ అని తెలిపారు.
News September 5, 2025
కడప జిల్లా విద్యుత్ ప్రాజెక్టులపై మంత్రివర్గం ఆమోదం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కడప జిల్లాలో 2,560 MW సామర్థ్యం కలిగిన పలు విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. జమ్మలమడుగు, ముద్దనూరు మండలాల్లోని గ్రామాల్లో100 MW విండ్ పవర్ ప్రాజెక్టులు, మైలవరం మండలంలో 60 MW హైబ్రిడ్ విండ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్, కొప్పోలులో 2400 MW పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.