News September 4, 2025

కడప: ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిస్ మేళా

image

జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారికి ఈనెల 8న నగరంలోని ప్రభుత్వ డీఎల్టీసీ ఐటీఐలో ఉదయం పది గంటలకు అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ జ్ఞాన కుమార్ గురువారం తెలిపారు. పదవ తరగతి, ITI మార్కుల జాబితా, NTC, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్‌, పాస్ పోర్డ్ సైజ్ ఫొటోలు, ఒక సెల్ఫీ ఫొటో తీసుకురావాలని సూచించారు. స్టై ఫండ్ రూ.7700 నుంచి రూ.10000 వరకు ఉంటుందన్నారు.

Similar News

News September 7, 2025

ఉల్లి కొనుగోలును పగడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ శ్రీధర్

image

జిల్లాలో ఉల్లి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఉల్లి కొనుగోలు ప్రక్రియపై వ్యవసాయ, ఉద్యానవన, మార్క్ ఫెడ్, మార్కెట్ కమిటీ అధికారులతో సమీక్షించారు. ఉల్లి కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కమలాపురం, మైదుకూరులలో కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాటు చేయాలన్నారు.

News September 6, 2025

కడప: LLB సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

YVU LLB (మూడేళ్ల, ఐదేళ్ల) పరీక్ష ఫలితాలను విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. అల్లం శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. LLB (ఐదేళ్ల) మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 50.42 శాతం మంది, LLB (మూడేళ్ల) ఫస్ట్ సెమిస్టర్ ఫలితాల్లో 17.63 శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ. పి.పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. కృష్ణారావు పాల్గొన్నారు.

News September 6, 2025

ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో వైవీయూకు ఉన్నత స్థానం: వీసీ

image

బోధన పరిశోధన సేవ అనే దృక్పథంతో ఏర్పాటైన వైవీయూ అనతి కాలంలోనే అత్యున్నత ప్రమాణాలతో పరిశోధనలతో ప్రముఖ విశ్వవిద్యాలయంగా కీర్తిని అందుకుందని వైవీయూ వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు వెల్లడించారు. తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌ఐ‌ఆర్‌ఎఫ్) 2025లో వైవీయూ 51 నుంచి 100 లోపు ర్యాంకు లభించిందన్నారు.