News April 4, 2025

కడప: ఒంటిమిట్టకు 135 ప్రత్యేక బస్సులు

image

కడప జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ఒంటిమిట్ట క్షేత్రానికి 135 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు జిల్లా రవాణా అధికారి గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన ఒంటిమిట్ట క్షేత్రంలో సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కడప 35, జమ్మలమడుగు 10, మైదుకూరు 5, ప్రొద్దుటూరు 15, బద్వేలు 20, పులివెందుల 10 ఇతర ప్రాంతాల నుంచి మిగతా బస్సులు ఉంటాయన్నారు.

Similar News

News April 11, 2025

జమ్మికుంట: క్వింటా పత్తి ధర రూ.7,650

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర ఈరోజు కూడా పెరిగింది. గురువారం క్వింటా పత్తి ధర రూ.7,600 పలకగా.. ఈరోజు ₹50 పెరిగి రూ.7,650 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. శుక్రవారం యార్డుకు రైతులు 193 క్వింటాళ్ల విడిపత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,650, కనిష్ఠంగా రూ.7,300 ధర పలికింది. గోనె సంచుల్లో 13 క్వింటాలు తీసుకురాగా.. రూ.5,800 నుంచి రూ.6,400 వరకు పలికింది.

News April 11, 2025

త్వరలో ఏనుగుల తరలింపు: మంత్రి

image

ఏనుగులను ప్రస్తుతం ఉన్న ప్రాంతాల నుంచి త్వరలో తరలిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పంటలకు భారీ నష్టం వాటిల్లిందని, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఏనుగులను తరలించేందుకు కుంకీ ఏనుగులు వస్తాయని మంత్రి తెలిపారు. కురుపాం మండలంలోని మారుమూల గ్రామాల్లో రెండు రోడ్లను మంత్రి ప్రారంభించారు.

News April 11, 2025

నిఖితను చంపింది తల్లే.. వీడిన మిస్టరీ

image

AP: తిరుపతి జిల్లాలో సంచలనం రేపిన బాలిక <<16045416>>నిఖిత(17)<<>> అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి సుజాత ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. అనంతరం గంటల వ్యవధిలోనే నిఖితకు అంత్యక్రియలు జరిపారు. వేరే కులానికి చెందిన అజయ్ అనే యువకుడిని నిఖిత ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఇది తెలిసి పేరెంట్స్ ఆమెను మందలించి, అబార్షన్ చేయించారు.

error: Content is protected !!