News November 17, 2025

కడప: కరెంట్ సమస్యలు ఉన్నాయా?

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ CMD నిర్వహిస్తున్నట్లు APSPDCL ఛైర్మన్&ఎండీ శివశంకర్ తెలిపారు. రాయలసీమ జిల్లాల ప్రజలకు కరెంట్ సమస్యలు ఉంటే సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 89777 16661కు కాల్ చేయాలని సూచించారు. వీటితోపాటు 1912, వాట్సాప్ నంబర్ 91333 31912 ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Similar News

News November 17, 2025

3,928 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

ఐబీపీఎస్ <>RRB<<>> పీవో ప్రిలిమ్స్ 2025 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచింది. RRB పీవో పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు www.ibps.in/ సైట్లో రిజిస్ట్రేషన్, రోల్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 3,928 పోస్టులకు ఈ నెల 22,23 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

News November 17, 2025

ఇంటర్వ్యూ తో NIELITలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (<>NIELIT<<>>) 4 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ, BE, B.Tech, M.Tech, MSc, CA, CMA/B.Com, M.Com ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 23వరకు అప్లై చేసుకోవచ్చు . దరఖాస్తు ఫీజు రూ.200. ఈ నెల 26న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.nielit.gov.in/

News November 17, 2025

KNR: ర్యాష్ డ్రైవింగ్.. మారని RTC, లారీ డ్రైవర్ల తీరు..!

image

రోజూ ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతున్నా RTC డ్రైవర్లు, భారీ వాహనాల డ్రైవర్ల డ్రైవింగ్ తీరు మాత్రం మారడంలేదు. మితిమీరిన వేగంతో ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. పైన కన్పిస్తున్న దృశ్యం KNR(D) మానకొండూరు మం. అన్నారం-లలితాపూర్ గ్రామాల మధ్యున్న కల్వర్టుపై కన్పించింది. ఇందులో బస్సు, ఇసుక లారీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడాన్ని గమనించొచ్చు.