News October 13, 2025
కడప: కుటుంబం ఆత్మహత్య.. మృతులు వీరే.!

కడప నగర శివారులో ఆదివారం రాత్రి <<17990044>>ఓ కుటుంబం<<>> రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న వెంటనే రైల్వే పోలీసులు ఘటనా స్థలం చేరుకొని మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. మృతుల వివరాలను రైల్వే ఎస్సై తెలిపారు. కడప శంకరాపురానికి చెందిన శ్రీరాములు, భార్య శిరీష, కుమారుడు రితిక్‌గా పేర్కొన్నారు. మృతుడు స్థానికంగా ఓ మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాలి
Similar News
News October 13, 2025
కడప: అయ్యో రితిక్.. అప్పుడే నూరేళ్లు నిండాయా.!

కడపలో రైలు కింద పడి <<17990131>>కుటుంబం ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటన కలచి వేస్తోంది. శంకరాపురానికి చెందిన శ్రీరాములు, భార్య శిరీష, 18 నెలల వయసు ఉన్న కుమారుడు రితిక్‌తో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చిన్నారి రితిక్ మృతి చెందడం పలువురిని ఆవేదనకు గురి చేస్తుంది. అభం శుభం తెలియని వయసులో ఏం జరుగుతుందో తెలియక, తన తల్లి రైలు కిందకు ఎందుకు తీసుకుని వెళ్తుందో అర్థం కాక చిన్నారి మృతి చెందడం బాధాకరం.
News October 12, 2025
కమలాపురం: ఈతకు వెళ్లి బాలిక మృతి

కమలాపురంలో ఈతకు వెళ్లి బాలిక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వివరాల మేరకు.. ఈర్ల సుకన్య (11) అనే బాలిక ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి గల్లంతైంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకి తీశారు. ఇసుక తవ్వడంతో లోతైన గుంతలు ఏర్పడడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పేర్కొన్నారు.
News October 12, 2025
ప్రొద్దుటూరు: రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపికైన దియా సింహ

ప్రొద్దుటూరుకు చెందిన సింహా సేన్ రెడ్డి కుమార్తె దియా సింహ రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపికైంది. కడపలో శనివారం జరిగిన జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలలో విద్యార్థిని దియా సింహ బ్రాంజ్ మెడల్ సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. త్వరలో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో దియాసింహ పాల్గొనున్నట్లు కోచ్ నాగేశ్వరరావు తెలియజేశారు.