News January 20, 2025

కడప: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో ఏఈ మృతి

image

కడప ఇరిగేషన్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న నాగరాజు(42) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. KSRM ఇంజినీరింగ్ కాలేజీలో క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి ఆటగాళ్లు ఆయన్ను హుటాహుటిన కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈయనకు త్వరలో డీఈగా ప్రమోషన్ రానున్నట్లు తెలిసింది. దీంతో ఆయన కుటుంబీకులు శోకసంద్రంలో మిగిలారు.

Similar News

News September 12, 2025

కడప: RI వీరేశంను సన్మానించిన ఎస్పీ

image

కడప జిల్లా పోలీసు శాఖకు RI వీరేశ్ ఎంతగానో సేవలు అందించాలని జిల్లా SP అశోక్ కుమార్ ప్రశంసించారు. శుక్రవారం బదిలీపై చిత్తూరుకు వెళ్తున్న ఆర్ఐ వీరేశ్‌కు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ అప్పగించిన విధులను సమర్ధవంతంగా నిర్వర్తించారన్నారు. వీఐపీల రాక సందర్భంలో ఆర్‌ఐ వీరేశ్ అంకితభావంతో విధులు నిర్వర్తించారన్నారు.

News September 12, 2025

భూ సమస్యలపై త్వరిత పరిష్కారం: ఆదితిసింగ్

image

కడప కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జేసీ ఆదితిసింగ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. భూ సంబంధిత ఫిర్యాదులకు బాధ్యతాయుతంగా స్పందించి, వచ్చే నెలలోపు పెండింగ్ ఫిర్యాదులను “సున్నా” స్థాయికి తగ్గించాలని ఆదేశించారు. సెక్షన్ 22-ఏ డెలిషన్, అసైన్డ్ భూముల పరిష్కారంలో క్షేత్రస్థాయి విచారణ తప్పనిసరని పేర్కొన్నారు.

News September 12, 2025

కలసపాడు: 3 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

image

కలసపాడు గ్రామంలోని టైలర్స్ కాలనీలో ఇమ్రాన్ (3)పై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బయట ఆడుకుంటున్న సమయంలో వీధికుక్కలు బాలుడిపై దాడి చేసి లాక్కొని వెళ్తుండగా తల్లిదండ్రులు చూసి కాపాడుకున్నారు. తీవ్ర గాయాలైన చిన్నారిని పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీధి కుక్కలు లేకుండా తరలించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.