News August 25, 2025
కడప: గంజాయి అమ్మకాలపై తనిఖీలు

కడపలో గంజాయి నిర్మూలనకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. గంజాయి అమ్మకాలకు సంబంధించి దుకాణాలను పరిశీలించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఉంటున్న వ్యక్తులను విచారించారు. గంజాయి అమ్మకాలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News August 25, 2025
జిల్లాలో 3350 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ: విజిలెన్స్ ఎస్పీ

జిల్లాలో యూరియా కొరత లేదని రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ SP శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దువ్వూరులో ఎరువుల షాపులను తనికి చేసిన అనంతరం మాట్లాడారు. జిల్లాలో 3350 మెట్రిక్ టన్నుల నిల్వ ఉందన్నారు. దువ్వూరు మండలంలోని RSKల్లో 20 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 72 మెట్రిక్ టన్నులు నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కచ్చితంగా MRP ధరకే విక్రయించాలని డీలర్లకు సూచించారు.
News August 25, 2025
మహిళలకు రక్షణ లేదు: రాచమల్లు

కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారిపై అత్యాచారాలు, హత్యలు ఎక్కువయ్యాయన్నారు. కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులే వీటిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని విమర్శించారు.
News August 25, 2025
కాశినాయన: బాల్ బ్యాట్మెంటన్‌లో సత్తా చాటిన విద్యార్థులు

రాజంపేటలో ఆదివారం జరిగిన బాల్ బ్యాట్మెంటన్ పోటీలలో కాశినాయన మండలం నరసాపురం ZPHS విద్యార్థులు సత్తా చాటారు. ఉమ్మడి కడప జిల్లా బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. సబ్ జూనియర్స్ విభాగంలో ఇర్ఫాన్, సంపత్, సీనియర్ విభాగంలో సోహెల్ ఈ నెల 29, 30, 31వ తేదీలలో ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో వారిని పలువురు అభినందించారు.