News March 24, 2024

కడప: గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ

image

దువ్వూరు మండలంలోని ఇడమడక మెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపల్లి బాల పెద్దన్నకు చెందిన 20 గొర్రెలు మృతిచెందాయి. గొర్రెల మంద రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఢీకొట్టిన లారీ నిలుపకుండా పోవడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. చాగలమర్రి టోల్ ప్లాజా వద్ద గుర్తింపుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News July 3, 2024

కడప: రైలు కింద పడి ASI ఆత్మహత్య

image

కడప జిల్లా కమలాపురం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న నాగార్జున రెడ్డి బుధవారం గంగాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన కమలాపురం పోలీస్ స్టేషన్‌ ఏఎస్ఐగా విధులు నిర్వర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 3, 2024

కడప: 5 నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్ రద్దు

image

కడప-విశాఖపట్నం-కడప మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రద్దు చేసినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని మూడో ప్లాట్‌ఫారం నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు.

News July 3, 2024

ఖాజీపేట హై‌స్కూల్ ఇన్‌ఛార్జ్ హెచ్ఎం సస్పెండ్

image

ఖాజీపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత నీరు తాగి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవిని సస్పెండ్ చేసినట్లు డీఈవో అనురాధ తెలిపారు. దీంతోపాటు ఖాజీపేట ఎంఈఓ-1 నాగ స్వర్ణలత, ఎంఈఓ-2 నాగరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నీటి ట్యాంకుల శుభ్రతలో ఇన్‌ఛార్జ్ హెచ్ఎం నిర్లక్ష్యం వల్లే నీరు కలుషితమైందన్నారు.