News August 28, 2024

కడప చరిత్రలో ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదు: రవీంద్రనాథ్ రెడ్డి

image

కడప నగర మేయర్ సురేశ్ బాబు ఇంటి ముందు చెత్త వేసి రభస చేసిన టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కడప చరిత్రలో ఇటువంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో నిధులు లేనప్పుడు దానిని నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు.

Similar News

News July 11, 2025

ప్రొద్దుటూరు: 159 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు

image

ప్రొద్దుటూరులోని రామేశ్వరం పురపాలక ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో 159 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు ఉన్నారు. ఇక్కడ ఐదు తరగతులు ఉన్నాయి. నెల కిందట ఇక్కడ HM, ఆరుగురు టీచర్లు ఉండేవారు. బదిలీల తర్వాత ఇక్కడ ఇప్పుడు HM ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. టీచర్ల కొరతపై MEO దృష్టికి తీసుకెళ్లామని HM వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. టీచర్ల సర్దుబాటు తన పరిధిలో లేదని MEO సావిత్రమ్మ తెలిపారు.

News July 10, 2025

కడప జిల్లాలో భారీగా పోలీసుల బదిలీలు

image

కడప జిల్లాలో గురువారం భారీగా పోలీసులు బదిలీ అయ్యారు. 169 పోలీస్ సిబ్బందిని ఒకేసారి బదిలీ చేస్తూ SP అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 24 మంది ASIలు, 32 మంది HCలు, 113 మంది PCలు ఉన్నారు. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న, ఆరోపణలున్న వారిని బదిలీ చేసిన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ ఉత్తర్వులను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు.

News July 10, 2025

కడప MLA తీరుపై విమర్శలు

image

మొహర్రం సందర్భంగా నాదర్ షావలీ దర్గా ఉరుసు నిర్వహించారు. ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం కేసీ కెనాల్లో రొట్టెలు వదిలారు. ఆ సమయంలో ఎమ్మెల్యే చెప్పులు వేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎంతో పవిత్రంగా రొట్టెలు వదిలే కార్యక్రమంలో ఎమ్మెల్యే చెప్పులు ధరించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతీశారని పలువురు అంటున్నారు.