News September 20, 2024

కడప జిల్లాకు పవర్ లిఫ్టింగ్‌లో పతకాల పంట

image

ఆర్కే వ్యాలీ IIIT పవర్ లిఫ్టింగ్ టీం కడప జిల్లా తరఫున ఇటీవల అమలాపురంలో జరిగిన ఏపీ 11వ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. టీమ్ చాంపియన్షిప్‌ సబ్ జూనియర్ విభాగంలో గర్ల్స్ ఫస్ట్ ప్లేస్, బాయ్స్ సెకండ్ ప్లేస్ కైవసం చేసుకున్నారు. మొత్తం 8 బంగారు, 7 రజిత, 1 కాంస్య పతకాలు సాధించారు. ఇందులో అమ్మాయిలు 6 బంగారు, 4 రజిత, 1 కాంస్య, అబ్బాయిలు 2 బంగారు, 3 రజిత పతకాలు సాధించారు.

Similar News

News February 14, 2026

గండికోటకు వెళ్తున్న ప్రేమ జంటకు ప్రమాదం.. యువతి మృతి.!

image

కడప నగర శివారులోని ఆలంఖాన్‌పల్లె సర్కిల్ వద్ద శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి గండికోటకు బైక్‌పై వెళ్తున్న ప్రేమజంటను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కేరళకు చెందిన సిరినా అనే యువతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె ప్రియుడు గాయపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. కడప 2-టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 14, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.15,800
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,536
* వెండి 10 గ్రాములు ధర రూ.2,550.

News February 14, 2026

ప్రొద్దుటూరు: పెట్రోల్ బంక్ స్కాంలో చెక్ బౌన్స్ కేసు.?

image

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంక్ స్కాంలో చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయి. వీటిపై చెక్ బౌన్స్ కేసు పెట్టనున్నారు. పెట్రోల్ బంక్ పూర్వపు మేనేజర్ ప్రవీణ్ బకాయిలకు సంబంధించి సుమారు రూ.50 లక్షల విలువైన 10 చెక్కులను మున్సిపాలిటీకి జమ చేశాడు. ఈ చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయని అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ తెలిపారు. పెట్రోల్ బంక్ బకాయిలపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపామని కమిషనర్ రవిచంద్రారెడ్డి తెలిపారు.