News December 13, 2025
కడప జిల్లాకు భారీగా నిధులు

కడప జిల్లాలో వినూత్నంగా అమలవుతున్న పథకాల అమలు నిమిత్తం రూ.7.5కోట్ల నిధులు నీతి అయోగ్ విడుదల చేసిందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. అందులో భాగంగా స్టార్ట్ అప్ కడప, స్మార్ట్ కిచెన్, ఆర్గానిక్ మార్కెటింగ్, అంగన్వాడీల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణకు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిని నీతి అయోగ్ కార్యదర్శి శేఖర్‌కు కలెక్టర్ శ్రీధర్ న్యూఢిల్లీలో వివరించారు.
Similar News
News December 19, 2025
ప్రొద్దుటూరులో నేడు బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలను వ్యాపారులు వెల్లడించారు.
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము ధర: రూ.13,220.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము ధర: రూ.12,162.00
*వెండి 10 గ్రాముల ధర: రూ.1,980.00
News December 19, 2025
కడపలో వారి గన్ లైసెన్సుల రద్దు..!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కడప జిల్లాలోని గన్ లైసెన్స్‌లపై దృష్టి సారించారు. లైసెన్స్ పొందిన వారి గురించి ఆరా తీస్తున్నారు. వారిపై కేసుల వివరాలు, నేర చరిత్రను పరిశీలిస్తున్నారు. జిల్లాలో సుమారు 850 దాకా గన్ లైసెన్స్‌లు ఉన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సమస్యలు సృష్టించే వారి గన్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేయనున్నారు.
News December 19, 2025
కడప జిల్లా కానిస్టేబుల్ అభ్యర్థులకు గమనిక

కడప జిల్లా కానిస్టేబుల్ అభ్యర్థులు(సివిల్) శిక్షణకు హాజరు కావాలని SP విశ్వనాథ్ ఆదేశించారు. ‘పురుషులకు తిరుపతి కళ్యాణి డ్యాం, మహిళలకు ఒంగోలు PTCలో ఈనెల 21 నుంచి ట్రైనింగ్ ఉంటుంది. ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, SBI పాస్‌బుక్ జిరాక్స్, రూ.10వేల కాషన్ డిపాజిట్, పోలీస్ డిపార్ట్‌మెంట్ సర్వీస్ బుక్, 6స్టాంప్ సైజ్ ఫోటోలు, రూ.100 అగ్రిమెంట్ బాండ్‌తో ఎస్పీ ఆఫీసుకు 21వ తేదీ రావాలి’ అని SP చెప్పారు.


