News April 22, 2024

కడప జిల్లాను భయపెడుతున్న ఉష్ణోగ్రతలు

image

జిల్లాలో వారం రోజుల నుంచి రాత్రి, పగలు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. రాత్రిళ్లు ఇళ్లలో సరైన నిద్రలేక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ పెరుగుతున్నాయి. ఉ.9 గంటల నుంచి సూర్యుడు సుర్రుమంటున్నాడు. పగలంతా ఎండతాకిడితో అల్లాడిన జనం రాత్రి పూటైనా కాసింత ప్రశాంతంగా నిద్రపోదామంటే కూడా కుదరని పరిస్థితి నెలకొందని అంటున్నారు.

Similar News

News September 7, 2025

చంద్రగ్రహణం.. ఒంటిమిట్ట ఆలయం మూసివేత

image

ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం ఆలయాన్ని మూసివేయనున్నారు. అలాగే కడప జిల్లాలోని పలు ఆలయాలు పొలతల మల్లేశ్వరస్వామి, పులివెందులలోని వెంకటేశ్వర స్వామి, మిట్ట మల్లేశ్వరస్వామి, రంగనాథస్వామి ఆలయం, గండి వీరాంజనేయస్వామి ఆలయం, నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయం మూసివేయనున్నట్లు గండి EO వెంకటసుబ్బయ్య తెలిపారు.

News September 7, 2025

3 నెలల్లో స్మార్ట్ కిచెన్‌ల నిర్మాణాలు పూర్తి: కలెక్టర్

image

కడప జిల్లాలోని 33 మండలాల్లో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ల నిర్మాణాలను మూడు నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ మండలాల్లో స్మార్ట్ కిచెన్ నిర్మాణాల అంచనాలు, టెండర్లు, మెటీరియల్ సంబంధిత అంశాలపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. 3 నెలల్లో పూర్తయ్యేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించాలన్నారు.

News September 7, 2025

కడప జిల్లాను ప్రథమ స్థానంలోకి తేవాలి: కలెక్టర్

image

నీతి అయోగ్ నిర్దేశించిన అంశాల్లో జిల్లాను ప్రథమ స్థానంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆకాంక్ష జిల్లా, ఆకాంక్ష బ్లాకుల్లో ఆరు విభాగాల్లో లక్ష్యాలను సాధించిన నేపథ్యంలో సంబంధిత భాగస్వామ్య శాఖల అధికారులు, ఫ్రెంట్ లైన్ అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ శనివారం కడపలోని ఓ కన్వెన్షన్ హాలులో “సంపూర్ణత అభియాన్ సత్కార కార్యక్రమం” జరిగింది.