News October 10, 2025
కడప జిల్లాలో ఆర్టీసీకి రూ.42లక్షల ఆదాయం

దసరా సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడిపారు. ఈక్రమంలో ఆర్టీసీకి మంచి ఆదాయం లభించినట్లు ఆర్ఎం గోపాల్ రెడ్డి వెల్లడించారు. ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులు రాకపోకలు సాగించడంతో రూ.42.69 లక్షల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినందుకు ఆయన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News October 10, 2025
కడప: ఇతనో బడా స్మగ్లర్.. 128 కేసులు

కడప జిల్లా దువ్వూరు మండలం పుల్లారెడ్డి పేటకు చెందిన దస్తగిరి రెడ్డిపై పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న అతడిని అంతర్ రాష్ట్ర స్మగ్లర్‌గా గుర్తించారు. 8 ఏళ్లలో అతనిపై 128 కేసులు నమోదైయ్యాయి. ఇందులో 90 ఎర్రచందనం కేసులు, 38 దొంగతనం కేసులు ఉన్నాయి. గతంలో మూడుసార్లు పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి వచ్చాడని ఎర్రచందనం ప్రత్యేక దళ సీఐ శంకర్ రెడ్డి తెలిపారు.
News October 10, 2025
కడప: క్రికెటర్ కావాలని ఉందా?

క్రికెట్‌పై ఆసక్తి ఉన్నవారితో టాలెంట్ హట్ నిర్వహిస్తామని కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎ.రెడ్డి ప్రసాద్ తెలిపారు. బాగా ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ కిట్, ఆధార్ కార్డు, బర్త్, స్టడీ సర్టిఫికెట్, ఓ ఫొటోతో కడపలోని YSR ACA క్రికెట్ స్టేడియానికి రావాలని సూచించారు. 13న అండర్-12, 14న అండర్-14, 15న అండర్-16, 16న అండర్-19 క్రీడాకారులు రావాలి.
News October 10, 2025
RSK కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: కలెక్టర్

జిల్లాలో తొలి ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లో వ్యవసాయ, సివిల్ సప్లై అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. రైతులు దళారుల మాటలు నమ్మి నష్టపోవద్దన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం RSK కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు.